ధనుష్ ప్రస్తుతానికి టాలీవుడ్ పై గట్టిగా ఫోకస్ చేస్తున్నాడు. శేఖర్‌కమ్ముల దర్శకత్వంలో ఓసినిమా చేయడానికి ధునుష్ ఒప్పుకున్న సంగతి తెలిసిందే. వెంకీ అట్లూరి కథకు కూడా ధనుష్ ఓకే చెప్పేశాడు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. శేఖర్ కమ్ముల కంటే.. వెంకీ అట్లూరి సినిమానే ముందుగా పట్టాలెక్కేచాన్సుంది. ఇప్పటికే కథని లాక్ చేసేసినట్టు సమాచారం. విద్యావ్యవస్థ నేపథ్యంలో ఈ సినిమా సాగబోతోందని తెలుగు360 ముందే చెప్పింది. ఇప్పుడు కథానాయిక కూడా దాదాపుగా ఖాయమైపోయిందని టాక్. ఈ చిత్రంలో కథానాయికగా పూజా హెగ్డేని ఎంచుకున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రబృందం పూజాతో సంప్రదింపులు జరుపుతోంది. తన డేట్లు, కాల్షీట్లు.. అన్నీ సరితూగితే… పూజా ఎంట్రీ ఖాయమైపోయినట్టే. పూజా ఈమధ్య తమిళ హీరోల దృష్టిలో పడుతోంది. విజయ్ సరసన ఓ చిత్రంలో నటిస్తోంది. ఇప్పుడు ధనుష్ సినిమా కూడా ఓకే అయిపోతే – కోలీవుడ్ లోనూ పూజా హవా మొదలైపోయినట్టే.