ఎన్టీఆర్‌ని వెండి తెరపై చూడాలంటే అక్టోబరు 13 వరకూ ఆగాలి. అదే బుల్లి తెర అయితే.. ఆగస్టు 15 వరకూ చాలు. ఎందుకంటే… `మీలో ఎవరు కోటీశ్వరుడు` ప్రదర్శితమయ్యేది అప్పుడే. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రమోషన్లని భారీ ఎత్తున ప్లాన్ చేస్తున్నారు. ప్రోమోలపై ప్రోమోల్ని వదలుతున్నారు. ఈ షో కోసం దాదాపు 5 ప్రోమోల్ని డిజైన్ చేశారు. దానికి కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించారు. `సోగ్గాడే చిన్నినాయిన` తో దర్శకుడిగా అరంగేట్రం చేశారు కల్యాణ్ కృష్ణ. ఇప్పుడు `బంగార్రాజు` స్క్రిప్టులో బిజీగా ఉన్నారు. ఆయన నేతృత్వంలోనే ఈ షోకి సంబంధించిన అన్ని ప్రోమోల్నీ డిజైన్ చేశారు. ఆగస్టు 15లోగా ఒకదానికి తరవాత మరోటి విడుదల కానున్నాయి. ఈ షోలో మరో దర్శకుడు త్రివిక్రమ్ హ్యాండ్ కూడా ఉంది. కొన్ని ఎపిసోడ్లకు ఆయన దర్శకత్వం వహించారు. మొత్తానికి టీవీ షోని సినిమా రేంజ్ లో డిజైన్ చేశారన్నమాట. రామ్ చరణ్ ఓ ఎపిసోడ్ లో పాల్గొని రూ.25 లక్షలు గెలుచుకున్నట్టు టాక్. ఆ ఎపిసోడ్ తోనే కర్టెన్ రైజర్ ఉండొచ్చు.