ప్రభాస్ చేస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం `ప్రాజెక్ట్ కె`. కె అనేది ఈ సినిమా టైటిల్ లో మొదటి అక్షరం. ఆ టైటిల్ ని రివీల్ చేయకుండా.. కేవలం మొదటి అక్షరాన్నే.. వర్కింగ్ టైటిల్ గా పెట్టుకుంది చిత్రబృందం. ఈ సినిమాలో ఇప్పటికే అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణె లాంటి స్టార్లు ఉన్నారు. ఇప్పుడు మరో కథానాయిక కూడా నటించబోతోందని టాక్. ఈ సినిమాలో కథానాయిక తరవాత అంతటి ప్రాధాన్యం ఉన్న స్త్రీ పాత్ర ఉందని తెలుస్తోంది. ఆ పాత్రలో సమంతని ఎంచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. అయితే ఇది డీ – గ్లామర్ పాత్ర. ఇది వరకు ఇలాంటి డీ గ్లామర్ పాత్రల్లో సమంత మెప్పించింది. `మహానటి`తో నాగ అశ్విన్ తో సమంతకు మంచి అనుబంధం ఏర్పడింది. అందుకే … `ప్రాజెక్ట్ కె`లోనూ సమంతని తీసుకోవాలని నాగ అశ్విన్ భావిస్తున్నాడు. ప్రభాస్ సినిమా.. పైగా నాగ అశ్విన్. అమితాబ్ లాంటి మహానటుడు ఉన్నాడు. కాబట్టి.. సమంత నో చెప్పే ఛాన్సే లేదు.