కిషోర్ తిరుమల దర్శకత్వంలో శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తున్న సినిమా `ఆడాళ్లూ మీకు జోహార్లు`. ఈ సినిమా టైటిల్ కి న్యాయం చేస్తు్న్నాడు…దర్శకుడు. మహిళల ఔనత్యాన్ని, వాళ్ల మానసిక దృక్పథాన్ని చూపించబోతున్నాడు ఈ సినిమాలో. దానికి తగ్గట్టుగానే మహిళా పాత్రలతో ఈ సినిమాని నింపేస్తున్నాడు. ఇందులో రష్మికని కథానాయికగా ఎంచుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ముగ్గురు వెటరన్ కథానాయికలకు చోటిచ్చాడు. ఈ సినిమా కోసం ఖుష్బూ, రాధిక, ఊర్వశిలను ఎంచుకున్నారు. ఈ చిత్రంలో కీలకమైన పాత్రల్లో ఈ ముగ్గురు నటీమణులు కనిపిస్తారని చిత్రబృందం ప్రకటించింది. `అజ్ఞాతవాసి`లో ఖుష్బూ ఓ కీలకమైన పాత్ర పోషించారు. ఆ తరవాత తను తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. రాధిక నటించి కూడా చాలా కాలమైంది. ఈ ముగ్గుర్నీ ఒకే స్క్రీన్ పై చూడడం ఆ తరం ప్రేక్షకులకు ఓ చక్కటి అనుభూతిగా మిగులుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు.