కోర్టు ధిక్కరణ పిటిషన్లపై కోర్టు ఖర్చుల కోసం ప్రభుత్వం రూ. 58 కోట్లు మంజూరు చేయడంపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎక్కడెక్కడ ఎలా ఖర్చు పెడతారో చెప్పాలని .. పూర్తి వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. అయితే.. ఎవరికైనా కోర్టు ధిక్కరణ అంటే ముందుగా మైండ్‌లో స్ట్రైక్ అయ్యేది ఏపీ ప్రభుత్వమే. ఎందుకంటే అక్కడ దాదాపుగా ప్రతీరోజూ కోర్టు ధిక్కరణ కేసులు విచారణ జరుగుతూ ఉంటాయి. కానీ ఇక్కడ కోర్టు ధిక్కరణ కేసులకు రూ. 58 కోట్లు రిలీజ్ చేసింది…ఏపీ సర్కార్ కాదు.. తెలంగాణ సర్కార్.
ఆగ్రహం వ్యక్తం చేసింది కూడా తెలంగాణ హైకోర్టే. ఓ లెక్చరర్.. .. ప్రభుత్వం కోర్టు ధిక్కరణ కేసుల విచారణకు ఇలా రూ. 58 కోట్లు విడుదల చేసిందని.. ఇది అక్రమమని పిల్ దాఖలు చేశారు. దీనిపై చీఫ్ జస్టిస్ బెంచ్ విచారణ చేపట్టింది. ఇంత పెద్ద మొత్తం ప్రజాధనం… ఎలా ఖర్చు చేస్తారో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ట్రజరీ నిబంధనలను కూడా చెప్పాలని ఆదేశించింది. చీఫ్ సెక్రటరీ సోమేష్‌కుమార్‌కు వ్యక్తిగత హోదాలనూ నోటీసులు ఇచ్చింది.
తదుపరి విచారణ అక్టోబర్ ఇరవై ఏడో తేదీకి వాయిదా వేసింది. తెలంగాణ సర్కార్ కోర్టు ధిక్కరణ కేసులను అంతగాఎదుర్కోవడం లేదు. అయినప్పటికీ.. ఇంత పెద్ద మొత్తం ఎందుకు నిధులు విడుదల చేశారో క్లారిటీ లేదు. హైకోర్టులో విచారణకు వచ్చిన తర్వాతనే ఈ విషయం హైలెట్ అయింది. దీనిపై ప్రభుత్వం ఏం సమాధానం చెబుతుందో కానీ… నిజంగానే తెలంగాణ .. కోర్టు ధిక్కరణ కేసులకు అంత పెద్ద మొత్తంలో ఖర్చు పెడితే.. ఇక ఏపీ ఎంత ఖర్చు పెట్టాలో అన్న కంపేరిజన్ కూడా… సామాన్యుల్లో వస్తోంది.