నాని సినిమా `టక్ జగదీష్` థియేటరికల్ రిలీజ్ కోసం ఎదురు చూసీ, చూసీ ఓటీటీకి వెళ్లిపోతోందని ప్రచారం జరుగుతోంది. ఆ మాట ఎంత వరకూ నిజమో తెలీదు గానీ, నాని నిర్మాతగా తెరకెక్కిస్తున్న సినిమా మాత్రం నేరుగా ఓటీటీలోనే విడుదల చేయబోతున్నారు. నాని నిర్మాణంలో `మీట్ – క్యూట్` అనే చిత్రం రూపొందుతోంది. ఇందులో ఐదుగురు హీరోయిన్లు నటిస్తున్నారు. అయితే… ఇవి ఐదు కథల సమాహారం. ఆంథాలజీ అన్నమాట. ఈ టైపు కథల్ని… ఓటీటీ ప్రేక్షకుల్ని దృష్టిలో ఉంచుకుని డిజైన్ చేస్తారు. `మీట్ – క్యూట్`దీ అదే వ్యవహారం. ఇప్పటికే ఓ ఓటీటీ సంస్థతో డీల్ సెట్టయిపోయిందని, త్వరలోనే ఆ వివరాల్ని చిత్రబృందం ప్రకటించబోతోందని తెలుస్తోంది. హీరోగానే కాదు.. నిర్మాతగానూ నానిది సక్సెస్ఫుల్ జర్నీనే. తొలుత `ఆ` అనే ప్రయోగాత్మక చిత్రం తీశాడు. ఆ తరవాత వచ్చిన `హిట్` కూడా… సూపర్ హిట్టయ్యింది. నిర్మాతగా నాని ఎప్పుడూ ఫెయిల్ కాలేదు. ఈసారీ.. టేబుల్ ప్రాఫిట్ తోనే సినిమాని ఓటీటీకి ఇచ్చేశాడని టాక్.