పులిచిందల నుంచి తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి చేస్తే నీటిని వృధా చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం కేంద్రానికి ఫిర్యాదుల మీద ఫిర్యాదులుచేసింది. చివరికి సుప్రీంకోర్టులోనూ పిటిషన్ వేసింది. కానీ ఇప్పుడు గేటు విరిగిపోయి ప్రాజెక్ట్ మొత్తం ఖాళీ అవుతున్నా… నిమ్మళంగా ఉంది. పులిచింతల ప్రాజెక్టు గేటు విరిగిపోయి నీటిలో కొట్టుకోపవడం సంచలనం సృష్టించింది. దానిపై ప్రభుత్వ స్పందన అందర్నీ మరింతగా ఆశ్చర్య పరిచింది. మంత్రి అనిల్.. కొడాలి నాని వంటి వాళ్లు విహారయాత్రకు వచ్చినట్లుగా వచ్చిచూసి వెళ్లారు. ఏం చేయాలన్నదానిపై ఎవరికీ సరైన అభిప్రాయం లేదు. స్టాప్ లాక్ గేటు పెట్టాలని.. దానికి కూడా నీటి ప్రవాహం తగ్గిపోవాలని చెబుతున్నారు. జలవనరుల శాఖ అధికారులు.. ప్రాజెక్ట్ ఖాళీ అయిన తర్వాతనే ఏదో ఒకటి చేస్తామన్నట్లుగా మాట్లాడుతున్నారు. దీంతో నీరు పోతూనే ఉన్నాయి.
పులిచింత ప్రాజెక్ట్ నిర్మాణం .. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వైఎస్ సీఎం ఉండగా సాగింది. చాలా కాలంగా ప్రతిపాదనల్లో ఉన్నప్పటికీ.. వైఎస్ జలయజ్ఞంలో భాగంగా 2004లో శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించారు. పర్యావరణ అనుమతులు.. ఇతర అంశాల కారణంగా పనులు ఆలస్యంగా జరుగుతూ వచ్చాయి. చివరికి 2013లో ప్రాజెక్ట్ పూర్తయింది. పనుల నాణ్యతపై మొదటి నుంచి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అయితే.. ఆనాటి ప్రభుత్వ పెద్దల సన్నిహితులే కాంట్రాక్టర్లు కావడంతో ఎవరూ పట్టించుకోలేదు. ఇటీవల వరకూ.. పూర్తి స్థాయిలో నీటిని నిల్వ చేసే అవకాశం దక్కలేదు. నిర్వాసితులకు పూర్తి పరిహారం చెల్లించకపోవడమే కాదు. చంద్రబాబు హయాంలో పూర్తి పరిహారం చెల్లించడంతో 40టీఎంసీల మేర నీటి నిల్వకు అవకాశం ఏర్పడింది.
ఈ ఏడాది వచ్చిన వరదలకు.. దిగువకు నీటిని విడుదల చేసేందుకు చేసిన ప్రయత్నంలోనే గేటు కొట్టుకుపోయింది. మిగిలిన గేట్లూ శబ్దాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం ఈప్రాజెక్టును ఎవరు నిర్వహిస్తున్నారో .. బాధ్యత ఎవరిదో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉంది. బకాయిలు చెల్లించలేదని కాంట్రాక్టర్ ఎప్పుడో పట్టించుకోవడం మానేశారు. నిర్మించిన కాంట్రాక్టర్తోనూ చెల్లింపుల విషయంలో కోర్టు వివాదాలున్నాయని చెబుతున్నారు. ఇన్ని సమస్యల నడుమ పులిచింతల ప్రాజెక్ట్ నిర్వహణను గాలికి వదిలేయడమే… ప్రస్తుతం గేటు కొట్టుకోవపడానికి కారణంగా భావిస్తున్నారు
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కృష్ణానదికి వరదలు వచ్చిన సందర్భంలో ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తారు. మళ్లీ మూసేసే సమయంలో గేట్లకు పడవ అడ్డం పడింది. దాన్ని ఎలా తీయాలే ఎవరికీ అర్థం కాలేదు. చివరికి బ్యారేజీలో నీరంతా కిందకు వెళ్లిపోయారు. ఆ తర్వాత ఆ పడవను తీశారు. ఇప్పుడు ఎంత కాలానికి ఈ గేటు బాగు చేస్తారో అర్థం కాని పరిస్థితి. ఎంత లేటయితే.. అంత నీరు వృధా..!