దేశంలో జడ్జిల్ని కోర్టుల్ని శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నా సీబీఐ, ఐబీ సహా ఏ వ్యవస్థా పట్టించుకోవడం లేదని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జార్ఖండ్‌లో ఓ న్యాయమూర్తి జాగింగ్‌కు వెళ్తూండగా కొంతమంది దుండగులు ఆటోతో ఢీకొట్టి హత్య చేశారు. ఈ ఘటనపై సుమోటోగా సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఈ సందర్భంలో దేశంలో న్యాయవ్యవస్థ.. న్యాయమూర్తులు ఎదుర్కొంటున్న సవాళ్లు, దానిపై ఇతర వ్యవస్థలు స్పందించకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. సీజేఐ ఎన్వీరమణ, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మానసం జార్ఖండ్ న్యాయమూర్తి హత్యపై సుమోటో విచారణ జరిపింది.
న్యాయమూర్తులను కేవలం శారరీరకంగా మాత్రమే కాదని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయడం ద్వారా మానసికంగా కూడా వేధిస్తున్నారని ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇలాంటి కేసుల్లో సీబీఐ విచారణకు ఆదేశించినా ఎలాంటి ఫలితం ఉండటం లేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. ర్పులు వ్యతిరేకంగా ఇచ్చిన న్యాయమూర్తులను కించ పర్చడం అనేది దేశంలో కొత్త ట్రెండ్‌గా మారిందని సీజేఐ రమణ ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితులపై ఫిర్యాదులు చేసినా.. ప్రయోజనం ఉండటం లేదు.. న్యాయవ్యవస్థకు సీబీఐ, ఐబీ సహకరించడం లేదని స్పష్టం చేశారు. ఈ కామెంట్లను తాను పూర్తి బాధ్యతతో చేస్తున్నట్లుగా అటార్నీ జనరల్‌తో సీజేఐ వ్యాఖ్యానించారు.
ఇలాంటి వేధింపులకు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ కూడా బాధితుడే. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో న్యాయమూర్తులను అత్యంత దారుణంగా కించ పరుస్తూ కొంత మంది సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీనిపై విచారణ జరపాలని ఏపీ హైకోర్టు సీబీఐనిఆదేశించింది. అయితే ఆ కేసులో ఇంత వరకూ సీబీఐ పెద్దగా దర్యాప్తు చేసిందేమీ లేదు. ఇటీవలి కాలంలో ఒకరిద్దర్ని అరెస్ట్ చేసింది. కానీ ఆకేసును చేధించడంలో పురోగతి లేదు. న్యాయమూర్తులపై దాడులకు సంబంధించి విచారణలకు ఆదేశించినా సీబీఐ ఏమీ చేయడం లేదని.. మార్పు వస్తుందని తాము ఆశిస్తున్నా.. అది వాస్తవంలోకి రావడం లేదని సీజేఐ వ్యాఖ్యానించారు. జార్ఖండ్ న్యాయమూర్తి హత్య కేసులో సోమవారం కల్లా పూర్తి స్థాయి విచారణ నివేదికను సమర్పించాలని సీబీఐని సుప్రీంకోర్టు ఆదేశించింది.