ఒలింపిక్ క్రీడల్లో భారత్ అనూహ్యమైన విజయాలు నమోదు చేస్తోంది. పతకాలు తెచ్చేవారు కొందరైతే ఎవరూ ఊహించని విజయాలతో సంచలనాలు సృష్టిస్తున్న వారు మరికొందరు. ఈ జాబితాలోకి కొత్తగా గోల్ఫర్ అదితి అశోక్ చేరారు. ఆమె గోల్ఫ్ క్రీడాకారిణి. ఎవరూ ఊహించని ఈ విభాగంలో ప్రస్తుతం ఆమె రెండో స్థానంలో కొనసాగుతున్నారు. మరొక్క రౌండ్ మిగిలి ఉంది. ఆ రౌండ్లోనూ ఆమె మెరుగైన ప్రదర్శన కనబరిస్తే… స్వర్ణం వస్తుంది.. లేదంటే రజతంతో సంతృప్తి పడాల్సి ఉంటుంది. మూడు రౌండ్లు ముగిసేసరికి టాప్ టూ స్థానంలో నిలిచింది.
గోల్ఫ్ విభాగంలో భారత ఆటగాళ్లు పోటీ పడుతున్నారన్న విషయం కూడాచాలా మందికి తెలియదు. ఆమె ఫైనల్కు చేరే వరకూ ఎవరూ పట్టించుకోలేదు. కానీ ఎవరైనా పట్టించుకుంటున్నారా లేదా అన్నదానిపై అదితి అశోక్ అసలు దృష్టి పెట్టలేదు. స్కోర్ సాధించడంపైనే దృష్టి పెట్టింది. మహిళల వ్యక్తిగత స్ట్రోక్ ప్లే విభాగంలో రెండో నిలిచిన అదితికి ఈ ఈవెంట్లో రజతం సాధించే అవకాశముంది. 60 మంది పోటీపడుతున్న ఈ క్రీడలో మూడో రౌండ్ ముగిసేసరికి అదితి 201 పాయింట్లు సాధించారు. అతి తక్కువ పాయింట్లు సాధించిన వారు విజేతలుగా నిలిస్తారు. అమెరికాకు చెందిన నెల్లి అదితి కన్నా మూడు పాయింట్లు తక్కువ సాధించి మొదటి స్థానంలో ఉన్నారు.
ఫైనల్ శుక్రవారమే జరగాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించకపోవడంతో శనివారానికి వాయిదా పడింది. ఒకవేళ శనివారం కూడా పోటీలు జరగకపోతే ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్న అదితికి రజతాన్ని ప్రదానం చేస్తారు. పోటీలు జరిగి మెరుగైన ప్రదర్శన చేస్తే స్వర్ణం వస్తుంది . ఎంత ఘోరమైన ఆటతీరు కనబరిచినా.. కాంస్య ఖాయమని అంచనా వేస్తున్నారు. పతకం ఖాయమైతే.. జరిగితే ఒలింపిక్స్లో పతకం సాధించిన తొలి భారత గోల్ఫర్గా అదితి అశోక్ చరిత్ర సృష్టిస్తారు. ఈ ఒలింపిక్స్లో కొత్త కొత్త విభాగాల్లో భారత ఆటగాళ్లు సంచలన విజయాలు నమోదు చేస్తున్నారు.