ఒలింపిక్స్ ముగియడానికి ఒక్క రోజు ముందు భారత్ కల నెర వేరింది. అధ్లెటిక్స్‌లో ఇంత వరకూ అందని పతకం అందంది అది కూడా ఏకంగా స్వర్ణమే. జావెలిన్ త్రోలో నీరజ్ చోప్రా స్వర్ణం సాధించాడు. 87.58 మీటర్ల దూరం జావెలిన్‌ను విసిరి స్వర్ణాన్ని ఒడిసి పట్టాడు. వందేళ్ల ఒలింపిక్స్ చరిత్రలోభారత్కు ఇంత వరకూ అధ్లెటిక్స్‌లో ఒక్కటంటే ఒక్క పతకమూ లేదు. కానీ ఈ సారి ఏకంగా స్వర్ణ పతకం వచ్చేసింది. పురుషుల జావెలిన్ త్రో ఫైనల్లో భారత ప్లేయర్ నీరజ్ చోప్రా చరిత్ర తిరగరాశాడు.
హరియాణాకు చెందిన 23 ఏళ్ల నీరజ్ చోప్రా క్వాలిఫయింగ్‌లో జావెలిన్‌ను 86.59 మీటర్ల దూరం విసిరి టాపర్‌గా నిలిచాడు. ఫైనల్లో అంత కంటే ఎక్కువగా 87.58 మీటర్లు విసిరాడు. తర్వాత రెండు స్థానాల్లోనూ చెక్ రిపబ్లిక్ అధ్లెట్లే ఉన్నారు. కానీ వారు కనీసం ఒక మీటర్ దూరంలోనే వెనుకబడ్డారు. 23 ఏళ్ల నీరజ్ చోప్రాకు ఇదే తొలి ఒలింపిక్స్. పాల్గొన్న తొలి సారే చోప్రా చరిత్ర సృష్టించాడు.
అంతకు ముందు భారత్‌కు మరో పతకం లభించింది. రెజ్లింగ్‌లో భజరంగ్ పూనియా కాంస్యం కోసం జరిగిన పోరులో ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా వదలకుండా పతకం సాధించాడు. ఈ రోజుతో భారత్ ఒలింపిక్స్‌లో పతకాల పోరాటం అయిపోయినట్లయింది. రేపు ముగింపు వేడుక జరుగుతుంది. ఓవరాల్‌గా భారత్ స్వర్ణం కూడా సాధించి.. పతకాల పట్టికలో ఘనంగానే ముగించిందని అనుకోవాలి.