సీఐడీ సునీల్‌కుమార్‌పై చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి లేఖ రాసింది. ఈ సారి లేఖ రాసింది ఆయనపై నమోదైన వరకట్న వేధింపుల కేసులో. పీవీ సునీల్ కుమార్‌కు ఆయన భార్యతో విబేధాలున్నాయి. ఆయనపై నాలుగేళ్ల కిందట హైదరాబాద్‌లో వరకట్న వేధింపుల కేసు పెట్టారు. ఆ కేసు విచారణలో చార్జిషీట్ దాఖలయింది. పీవీ సునీల్ భార్య .. మాజీ ఐఏఎస్ పీవీ రమేష్ సోదరి. వరకట్న వేధింపుల కేసులో ఐపీఎస్ అధికారి ఉన్నారని.. కీలకమైన పొజిషన్లలో బాధ్యతలు నిర్వహిస్తూ … చట్టాలను ఉల్లంఘిస్తున్నారటూ ఎంపీ రఘురామకృష్ణరాజు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఎంపీ ఫిర్యాదుపై స్పందించిన కేంద్ర హోంశాఖ… కేసు వివరాలు తెప్పించుకుని ఆయనపై చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సిఫార్సు చేసింది.
నిజానికి కేంద్రం నుంచి ఏపీ ప్రభుత్వానికి పీవీసునీల్కుమార్పై చర్యలు తీసుకోవాలని సిఫార్సు లేఖలు రావడం ఇదే మొదటి సారి కాదు. గతంలోనూ వచ్చాయి. పీవీ సునీల్ కుమార్ ఓ స్వచ్చంద సంస్థను పెట్టి… హిందూ మతాన్ని కించ పరిచేలా మాట్లాడుతున్నారని.. దేశాన్ని అవమానిస్తున్నారని గతంలో వీడియోలతో కలిపి రఘురామ కృష్ణరాజునే కేంద్రానికి ఫిర్యాదు చేశారు. ఈ అంశంపై విచారణకు ఆదేశించిన కేంద్ర హోంశాఖ చర్యలు తీసుకోవాలని ఏపీ ప్రభుత్వాన్ని కోరింది. అయితే ప్రస్తుతం పీవీ సునీల్ కుమార్ ప్రభుత్వ పెద్దల గుడ్ లుక్స్‌లో ఉన్నారు. వారు చెప్పినట్లుగా చేస్తూండటంతో ఆయనపై చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా లేరు.
పైగా ఆయన ఇప్పుడు పదవికి మించిన పరపతిని పోలీసు శాఖలో అనుభవిస్తున్నారన్న ప్రచారం కూడా జరుగుతోంది. రఘురామకృష్ణరాజు విషయంలో హైకోర్టు ఆదే్శాలు ఉల్లంఘించినందుకు ఆయనపై కోర్టు ధిక్కరణ కేసు కూడాపెట్టాలని ఆదేశాలు ఉన్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం పట్టించుకోవడం లేదు. తమకు కావాల్సిన అధికారి కాబట్టి కాపాడుతోంది. కానీ ప్రభుత్వం మారితే…. ఈ సిఫార్సులన్నీ బయటకు వస్తాయి. ఆయనకు ఉద్యోగ గండం ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుందని సివిల్ సర్వీస్ నిపుణులు చెబుతున్నారు.