హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్ బీజేపీ నేతగా తనపై ముద్ర వేసుకుని బీజేపీకి ఓటు వేయమంటూ ప్రచారం చేసుకుంటున్నారు. కానీ నిజంగా బీజేపీ నాయకులు అని చెప్పుకునేవారు ఎవరు ఆయన వెంట లేరు. కానీ పార్టీ హైకమాండ్ పెద్దలు కానీ.. రాష్ట్ర బీజేపీ పెద్దలు కానీ ఈటల రాజేందర్‌ను పట్టించుకున్నట్లుగా కనిపించడం లేదు. ఉపఎన్నిక తక్షణం జరుగుతుందనే నమ్మకాన్ని బీజేపీ హైకమాండ్ వ్యక్తం చేయడంతో పార్టీలో చేరిన మరునాటి నుండే ఈటల రాజేందర్ ప్రచారం చేసుకుంటున్నారు. పాదయాత్ర చేసి.. మోకాలి గాయానికి కూడా గురయ్యారు. డిశ్చార్జ్ అయిన వెంటనే… హుజూరాబాద్ వెళ్లిపోయారు. ఇప్పుడు టీఆర్ఎస్ కూడా అభ్యర్థిని ప్రకటించడంతో ఆయన మరింత బిజీ అవుతున్నారు.
అయితే ఆయన వ్యక్తిగతంగా అన్ని చూసుకుంటున్నారు కానీ బీజేపీ అగ్రనేతలకు మాత్రం ఆయన ఉపఎన్నిక పట్టడం లేదు. ప్రస్తుతం బండి సంజయ్ పాదయాత్ర చేసుకునేదుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. తొమ్మిదో తేదీ నుంచే ఆయన నడక ప్రారంభించాలని అనుకన్నారుకానీ.. కిషన్ రెడ్డి ఆశీర్వాదయాత్రవల్ల సాధ్యం కాలేదు. వాయిదా వేసుకున్నారు. ఈ నెలాఖరు నుంచి ప్రారంభించాలని అనుకుంటున్నారు. అదే సమయంలో కిషన్ రెడ్డి ఆశీర్వాదయాత్ర చేపడుతన్నారు. ఈ యాత్రను కేంద్రం నిర్దేశించింది. దీంతో ఆయన తప్పకచేపట్టాల్సిన పరిస్థితి ఉంది. రాష్ట్ర స్థాయి నేతలెవరూ ఈటల నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదు.
బీజేపీలో వర్గపోరు ఎక్కువగా ఉందన్న ప్రచారం నేపధ్యంలో వారి మధ్య ఈటల రాజేందర్ నలిగిపోతున్నారు. నిజానికి ఈటల పార్టీలోకి రావడం… కొంత మందిసీనియర్లకు అసలు ఇష్టం లేదు. కానీ ఆయనను బలవంతంగా చేర్పించారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు ఆయనకు సహాయనిరాకరణ చేస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సందర్భం వచ్చినప్పుడు అక్కడఈటల గెలుస్తాడని కాకుండా బీజేపీ గెలుస్తుందని చెప్పి.. సరి పెడుతున్నారు. దీంతో ఈటల టీఆర్ఎస్ను ఒంటరిగా ఎదుర్కొంటున్నారు. టీఆర్ఎస్ చతురంగబలాలను ఆయన ఎదుర్కోవాల్సి వస్తోంది.