ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతం సవాంగ్ వ్యక్తిగత గన్‌మెన్ హత్య చేసి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోయారు. అయితే అది ప్లాన్జ్గా చేసిన మర్డర్ కాదని.. ఆవేశంలో చేసిన హత్య అని పోలీసులు చెబుతున్నారు. ఈ ఘటనకు కుటుంబగొడవలే కారణం. శివనాగరాజు భార్యకు వెంకటేష్ అనే యువకుడితో వివాహేతర బంధం ఉంది. ఆ విషయం తెలిసి శివనాగరాజు భార్యను చాలా సార్లు హెచ్చరించాడు. తనకు ఉన్న పరిచయాలతో వెంకటేష్‌ను విజయవాడ నుంచి వెళ్లిపోయేలా చేయగలిగాడు. కానీ శివనాగరాజు భార్యను మాత్రం వెంకటేష్ మార్చిపోలేదు.
ఆమె కూడా తన భర్త శివనాగరాజు కన్నా వెంకటేష్‌నే ఎక్కువగా ఇష్టపడేది. శివనాగరాజు డ్యూటీకి వెళ్లిన సమయంలో ఇంటికి వచ్చే వెంకటేష్.. శివనాగరాజు భార్యతో గడిపి వెళ్లేవాడు. ఎంత చెప్పినా వినకపోవడంతో శివనాగరాజు భార్యను పుట్టింట్లో వదిలి పెట్టాడు. అయితే పెద్దలు సర్ది చెప్పడంతో ఆరు నెలల కిందట మళ్లీ విజయవాడ తిరిగి వచ్చింది. అయినా ఆమె .. వెంకటేష్‌తో సంబంధాన్ని కొనసాగించింది. నిన్న రాత్రి గన్‌మెన్ శివనాగరాజు డ్యూటీకి వెళ్లడంతో వెంకటేష్ … వాళ్లింటికి వెళ్లాడు. శివనాగరాజు భార్యతో గడిపాడు.
ఈ విషయాన్ని ఇంటి ఓనర్… డ్యూటీలో ఉన్న శివనాగరాజుకు చెప్పడంతో ఆవేశంగా వచ్చిన ఆయన… వెంకటేష్‌ను పట్టుకుని చితకబాదాడు వంటగదిలో దొరికిన వస్తువులతో కొట్టడంతో అతను చనిపోయాడు. విషయం తెలుసుకుని పోలీసులు శివనాగరాజుపై కేసు పెట్టి అదుపులోకి తీసుకున్నారు. కేసు విషయాన్ని గోప్యంగా ఉంచుతున్నారు. నిందితుడు డీజీపీ వ్యక్తిగత గన్‌మెన్ కావడంతో పోలీసు శాఖలో సంచలనం రేపింది.