ప్రధానమంత్రి నరేంద్రమోడీ 75వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పేదరికాన్ని.. నిరుద్యోగాన్ని తరిమికొట్టే గొప్ప పథకాన్ని ప్రకటించారు. ఎర్రకోటపై నుంచి దేశ గతిని మార్చే “గతిశక్తి ” అనే కొత్త కార్యక్రమాన్ని ప్రకటించారు. దీని కోసం కేంద్రం అక్షరాలు రూ. కోటి కోట్ల రూపాయలను ఖర్చు పెట్టబోతోంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఓ కార్యక్రమానికి ఇంత పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించాలని నిర్ణయించడం ఇదే ప్రధమం. రూ., కోటి కోట్లతో చేపట్టబోయే గతి శక్తి పథకం కింద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు చేపడతారు., భారత్లో తయారీని ప్రోత్సహించేందుకు ప్రధానంగా సహకారం అందిస్తారు.
స్థానిక తయారీదారులు అంతర్జాతీయ స్థాయి లో పోటీ పడేందుకు, సమగ్ర మౌలిక సదుపాయాల వృద్ధికి ఈ పథకం కింద నిధులు ఖర్చుపెడతారు. కటింగ్ ఎడ్జ్ ఇన్నోవేషన్, న్యూ ఏజ్ టెక్నాలజీలను ఉపయోగించి ప్రపంచ స్థాయి నాణ్యతా ప్రమాణాలతో ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. నోట్ల రద్దు ఆ తర్వాత కరోనా లాక్ డౌన్ల వల్ల దేశంలో చిన్నతరహా పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దీని వల్ల పెద్ద ఎత్తున యువత ఉద్యోగావకాశాలు కోల్పోయారు. ఇప్పుడుకేంద్రం రూ. కోటి కోట్తతో ప్రకటించిన గతిశక్తి వల్ల దేశంలో నిరుద్యోగిత కూడా బాగా తగ్గే అవకాశం ఉంది. అదే సమయంలో భారత్ తయారీ రంగానికి కేంద్రంగా మారే అవకాశంగా ఉందని అంటున్నారు.
ప్రధాని మోడీ ఎర్రకోటపై నుంచి లాంఛనంగా రూ. కోటి కోట్ల గతి శక్తి గురించి ప్రకటించారు. పూర్తిస్థాయిలో విధివిధానాల గురించి ప్రకటించలేదు. బహుశా.. ఈ నెలలో దీని గురించిప్రకటన చేసి… తర్వాత అమలు చేసే అవకాశం ఉంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో కేంద్రం నిధులు ఎలా సమీకరిస్తుదన్న డైలమా ఆర్థిక నిపుణుల్లో ఉంది. ప్రభుత్వం నోట్లను ముద్రిస్తుందా లేకపోతే… రుణాలు తీసుకొస్తుందా అన్నది ఎవరికీఅర్థంకాని విషయం. గతంలో కరోనా ప్యాకేజీ పేరుతో రూ. ఇరవై ఒక్క లక్షలకోట్ల ప్యాకేజీనిప్రకటించారు.అందులో ఎవరికీ నేరుగా ఆర్థిక సాయం లేకపోయినప్పటికీ.. నిధులకోసం..పెట్రోల్, డీజిల్పై పన్నులుబాదేశారు. ఇప్పుడు కూడా ఈ రూ.కోటి కోట్ల పథకానికి నిధుల సమీకరణకు పన్నులనే ఆదాయవనరుసగామార్చుకుంటే మాత్రం.. ఈ పథకం వల్ల ప్రయోజనం కంటే నష్టమే ఎక్కువ ఉంటుందని అంచనా వేస్తున్నారు.