ఇప్పుడంతా సమాచార శకం. చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే పనులన్నీ అయిపోతాయి. ఆఫీసుల్లో చేతుల్తో పన్ను పట్టుకునేది మాన్యువల్‌గా సంతకం చేయడానికే., మిగతా అంతా టెక్నికల్‌గా నడిచిపోతుంది. కానీ ఏపీ ప్రభుత్వం ఇప్పుడు అవన్నీ వద్దు.. మళ్లీ కంప్యూటర్లు ఏమీ లేనప్పుడు ఎలా చేతుల్తో రాసుకుని ఫైళ్లను దాచి పెట్టుకున్నారో అలా వెళ్లాల్సిందేనంటోంది. జీవోలను ఆన్లైన్లో పెట్టకూడదని నిర్ణయించిన తర్వాత మరేం చేయాలి అన్న ఆలోచనకు వచ్చి చివరికి రిజిస్టర్లు ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది.
మాన్యువల్ జీవోలను జారీ చేయాలంటే కంప్యూటర్లు రాక ముందు మూడు పద్దతులు పాటించేవారు. ఇప్పుడు అదే పద్దతులు పాటించాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. మామూలుగా జీవో ఎంఎస్, జీవో ఆర్టీ, జీవో పీ అనే మూడు విధానాలు ఉండేవి. ఆన్ లైన్ వచ్చాక.. వీటిని పెద్దగా పట్టించుకోలేదు. ఇప్పుడు ఈ మూడు పద్దతుల్లో జీవోలు జారీ చేస్తారు. ఎంఎస్.. అంటే ఇది మాన్యువల్ స్ర్కిప్ట్‌లో ఉంటుంది. వీటిని జాగ్రత్తగా ఉంచాలి. రెండో కేటగిరీ ఆర్టీ.. అంటే రొటీన్ జీవోలు. వీటిని పదేళ్ల వరకూ భద్రపరచాలి. మూడో కేటగిరీ పి.. అంటే ఆర్థిక పరమైనవి.
ఇప్పటి వరకూ 0ఇంతకు ముందు ఆన్లైన్లో జీవో ఇవ్వాలంటే ఆటోమేటిక్‌గా జీవో నంబర్ వచ్చేది. ఇప్పుడు అలా కాకుండా ప్రతీ శాఖ కార్యదర్శి మూడు రకాల రిజిస్టర్లను నిర్వహించి నెంబర్లు వేయాలి. ఇప్పుడు ఎవరికైనా జీవో కాపీ కావాలంటే ఆర్టీఐ చట్టం ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.సచివాలయంలో ఆయా శాఖలకు వెళ్లి తమకు జీవోలు కావాలని కోరాల్సిందే. జీవో కాపీల కోసం వెల్లువలా దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. అదే జరిగితే ఉద్యోగులకు పని భారం మరింత పెరుగుతుంది. ఇది ఉద్యోగుల్ని మరింత ఆందోళనకు గురి చేస్తోంది.