మరో రెండు రోజుల్లో చిరంజీవి పుట్టిన రోజు. ఇప్పటికే చిరు అభిమానుల సంబరాలు మొదలైపోయాయి. రేపట్నుంచి టాలీవుడ్ లోనూ ఆ హడావుడి కనిపించబోతోంది. చిరు చేతిలో చాలా సినిమాలున్నాయి. వేదాళం, లూసీఫర్ రీమేక్లతో పాటు… బాబి కథకూ ఆయన ఓకే చెప్పారు. మరోవైపు ఆచార్య ఉండనే ఉంది. వీటన్నింటికి సంబంధించిన అప్ డేట్ లూ.. చిరు పుట్టిన రోజు సందర్భంగా బయటకు రాబోతున్నాయి. ఆచార్య నుంచి ఓ టీజర్ ఉండొచ్చు. లూసీఫర్ రీమేక్ కి సంబంధించి టైటిల్ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఈ చిత్రానికి గాడ్ ఫాదర్ పేరు దాదాపుగా ఫిక్సయినట్టే.
మరోవైపు.. వేదాళం రీమేక్ కి `భోళా శంకర్` అనే పేరు ఖరారు చేసినట్టు సమాచారం. మెహర్ రమేష్ ఈ చిత్రానికి దర్శకుడు. బాబి దర్శకత్వంలో చిరంజీవి ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకి `వీరయ్య` అనే టైటిల్ పరిశీలిస్తున్నారని తెలుస్తోంది. ఈ సినిమాకి సంబంధించిన అప్ డేట్ కూడా…చిరు పుట్టిన రోజు సందర్భంగా రాబోతోంది. అయితే టైటిల్ ప్రకటిస్తారా? కొన్నాళ్లు దాచి ఉంచుతారా? అనేది తెలియాల్సివుంది.