ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లడం లేదు. ఆయన సీబీఐ కోర్టులో విదేశీ యాత్ర కోసం ఎలాంటి దరఖాస్తు చేసుకోలేదు. ఎలాంటి అనుంతి రాలేదు. దీంతో ఆయన యూరప్ పర్యటనకు వెళ్తున్నారన్న లీక్ వ్యూహాత్మకమేనని తేలిపోయింది. అయితే ఆయన ఐదు రోజుల ట్రిప్‌కు వెళ్తున్నారు. దేశంలోనే ఇతర పర్యాటక ప్రాంతాలకు వెళ్తున్నారు. ఆయన సిమ్లాకు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై అధికారిక సమాచారం లేదు కానీ ఆయన 26 నుంచి 31వ తేదీ వరకు అమరావతిలో ఉండబోవడం లేదని మాత్రం స్పష్టత వచ్చింది.
ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీన సీఎం జగన్‌కు స్పెషల్ డే. ఆ రోజున ఆయన వివాహ వార్షికోత్సవం. భారతితో వివాహం జరిగి ఆ రోజుకు పాతికేళ్లవుతుది. ఈ సిల్వర్ జూబ్లీని ఆయన ప్రత్యేకంగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటున్నారు. కుటుంబసభ్యుల కోరిక మేరకు అలాగే చేసుకోవాలని అనుకున్నారు. మామూలుగా అయితే విదేశాల్లోనే ఎక్కువ ప్రైవసీ ఉంటుంది కాబట్టి అక్కడికే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. కానీ ప్రస్తుతం కరోనా కారణం.. పర్మిషన్ తీసుకోవాల్సి రావడం వంటివాటితో పాటు కొన్ని ఇతర సమస్యలు కూడా ఉండటం వల్ల దేశంలోని పర్యాటక ప్రాంతాలకే ప్రాధాన్యం ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
ఉదయం ప్రత్యేక విమానంలో చండీఘడ్ వేళ్లే సీఎం ఫ్యామిలీ ఆ తర్వాత తాము సందర్శించాలనుకున్న ప్రాంతాలనుచూసే అవకాశం ఉంది. మళ్లీ సోమవారం రోజునే ఆయన అమరావతి వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ లోపు ఎప్పటికప్పుడు పరిణామాలు ఆయనకు తెలిపేందుకు ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. ఎలాగూ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అందరికీ అందుబాటులో ఉంటారు.