ఈమధ్యే చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు జరిగాయి. ఆ రోజుంతా మెగా ఇంట్లో సందడి నెలకొంది. చిత్రసీమ మొత్తం మెగా ఇంటి బాట పట్టింది. పైగా ఆ రోజు రాఖీ కూడా కావడంతో – సంబరాలు రెట్టింపయ్యాయి. పవన్ కల్యాణ్ తో సహా… మెగా కుటుంబం అంతా ఒకే చోట చేరింది. అయితే… వేడుకలు ఆ రోజుకే పరిమితం కాలేదు. ఆ రోజు నుంచీ… వారం రోజుల పాటు చిరు పుట్టిన రోజు వారోత్సవాలు జరుగుతూనే ఉన్నాయట. ప్రతీరోజూ చిరంజీవి ఇంట్లో విందూ – వినోదాలతో కళకళలాడిపోయిందని ఇన్సైడ్ వర్గాల టాక్. ఓరోజు సింధుని ఆహ్వానించి సత్కరించిం పంపారు. ఆ రోజున.. మెగా ఇంట్లో మ్యూజికల్ నైట్ జరిగిందట.చిరు పాటలకు… కుటుంబ సభ్యులంతా స్టెప్పులు వేశారని సమాచారం. రామ్ చరణ్, సాయిధరమ్ తేజ్, రానా, వైష్ణవ్ తేజ్, నిహారికలతో పాటుగా నాగార్జున కూడా ఈ పార్టీకి హాజరు అయ్యారని తెలుస్తోంది. చిరు ఇంట్లో ఏం జరిగినా… ఆ ఫొటోలూ బయటకు వచ్చాయి. అయితే ఈ మ్యూజికల్ నైట్ కి సంబంధించిన వీడియోలూ, ఫొటోలూ ఇంత వరకూ బయటకు రాలేదు. త్వరలోనే వదులుతారేమో చూడాలి.