ప్రత్యేక రాష్ట్రంగా విడిపోతే తెలంగాణ అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటోందని అప్పట్లో నిపుణులు విశ్లేషించారు కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదని అధికారిక నివేదికలు వెల్లడిస్తున్నాయి. నీతియో అర్థనీతి పేరుతో ఏడో నివేదికను విడుదల చేసింది. ఇందులో తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయినప్పటి నుంచి అనూహ్యమైన ప్రగతిని సాధించినట్లుగా నిర్ధారించింది. 2015 -16 ఆర్థిక సంవత్సరం నుంచి వార్షిక వృద్ధి రేటు 11 శాతం కంటే ఎక్కువగా ఉందని నీతి ఆయోగ్ తెలిపింది. 2014లో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది. అంటే.. ఉమ్మడిగా ఉన్న ఆ ఆర్థిక సంవత్సరం మినహా మిగిలిన ఆర్థిక సంవత్సారాల్లో ఆర్థిక వృద్ధి 11 శాతానికి పైగా ఉంది. రాష్ట్రం విడిపోక ముందే తెలంగాణలో తొమ్మిది శాతాని కంటే తక్కువగానే వృద్ధి రేటు ఉండేదని లెక్కలు చెబుతున్నాయి.
అంతే కాకుండా… ఇటీవల హరీష్ రావు ప్రకటించినట్లుగా దేశంలో అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని నీతిఆయోగ్ తేల్చింది. జీఎస్డీపీ పరంగా ఏడో పెద్ద రాష్ట్రంగా తెలంగాణ ఆవిర్భవించింది. పారిశ్రామిక రంగం ఫార్మా, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ భారీగా జీఎస్డీపీని అందిస్తున్నాయి. అదే సమయంలో టెక్స్టైల్స్, లెదర్, ఫుడ్ ప్రాసెసింగ్, మినరల్స్ వంటి సంప్రదాయ రంగాలు కూడా మంచి ప్రతిభను కనబరుస్తున్నాయని నీతి ఆయోగ్ స్పష్టం చేసింది. ఇక ఫార్మా రంగంలో తెలంగాణను లీడర్‌గా నీతి ఆయోగ్ తెలిపింది.
దేశం ఫార్మా ఎగుమతుల్లో హైదరాబాద్ వాటా 20 శాతంగా ఉంది. తెలంగాణలో మౌలిక సదుపాయాలు కూడా ఎక్కువగా ఉన్నాయని .. సాధారణ టూరిజంతో పాటు మెడికల్ టూరిజం కూడా హైదారబాద్‌లో భారీగా వృద్ధి చెందుతోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక పరంగా తాత్కాలికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ.. దీర్ఘకాలంలో తెలంగాణకు మేలు చేసే కార్యక్రమాలు తొలి దశలోనే చేపట్టడం వల్ల అనూహ్యమైన ప్రగతి తెలంగాణలో కనిపిస్తున్నట్లుగా నీతి ఆయోగ్ నివేదికను చూసి అంచనా వేయవచ్చంటున్నారు.