పాపులర్ కార్టూనిస్ట్ శ్రీధర్ ‘ఈనాడు’కు రాజీనామా చేయడం తెలుగు రాష్ట్రాల్లో టాక్ అఫ్ ది టౌన్ గా మారిన సంగతి తెలిసిందే. శ్రీధర్ రాజీనామా వెనుక కారణాలని చాలా వూహగానాలు వినిపించాయి.
ఈనాడుకి కార్టూనిస్ట్ శ్రీధర్ స్పెషల్ బ్రాండ్. ఈనాడు వయసు మొత్తం 47 ఏళ్ళు అయితే అందులో 40 ఏళ్ళు శ్రీధర్ పని చేసారు. శ్రీధర్ కార్టూన్ కి వున్న క్రేజ్ మామూలుది కాదు. పేపర్ మొత్తం చదవడానికి ముందే కిందనున్న “ఇదీ సంగతి” కార్టూన్ చూసే పాఠకులు లక్షల్లో ఉంటారు. అటువంటి శ్రీధర్ ఈనాడుకి రాజీనామా చేయడం హాట్ టాపిక్ గా మారింది. దీని వెనుక కారణాలు ఎవ్వరికీ అంతుపట్టడం లేదు. ఎవరికి తోచినట్టు వారు కొన్ని ఊహలు చేస్తున్నారు.
పత్రిక యాజమాన్యంకు శ్రీధర్ కి మధ్య ఏవో స్పర్ధలు వచ్చాయని, శ్రీధర్ ఆరోగ్యం సహకరించడం లేదని, కాస్ట్ కటింగ్ లో శ్రీధర్ ని తప్పించారని, పత్రికలో కొంతమంది ప్రముఖుల వ్యవహార శైలి శ్రీధర్ మనసు గాయపరిచిందని, ఆయనకి మరో పత్రిక నుంచి బంపర్ ఆఫర్ వుందని ఇలా అనే ఊసులు వినిపించాయి. అయితే తన రాజీనామా పై పూర్తి క్లారిటీ ఇచ్చారు శ్రీధర్. ”సోషల్ మీడియాలో రాస్తుందంతా తప్పుల తడక. జస్ట్ ఈనాడులో పని మానేసి వచ్చేశా అంతే, మరో కారణం ఏమీ లేదు. అనవసర ఊహాగానాలు వద్దు. ప్లీజ్” అని ఫేక్ బుక్ వేదికగా తన రాజీనామాపై జరుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. గత పేస్ బుక్ పోస్ట్ లో ఈనాడుకి రిజైన్ చేశానని శ్రీధర్ రాయడంతో చర్చ మొదలైయింది. ఐతే తాజా పోస్ట్ లో పని మాని వచ్చేశానని తనదైన స్టయిల్ లో చెప్పారు. మరి ఈ క్లారిటీతోనైనా శ్రీధర్ రాజీనామా వెనుక అనే కధనాలకు తెర పడుతుందేమో చూడాలి.