ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంలో మార్పులు తెస్తూ విద్యార్థుల తల్లి ఖాతాలోకి ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయడాన్ని ఉద్దేశించిన జీవోను హైకోర్టు కొట్టి వేసింది. నేరుగా ప్రిన్సిపాళ్ల ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది. ఫీజు రీఎంబర్స్మెంట్ అంటే.. అర్హత ఉన్న విద్యార్థులకు ప్రభుత్వమే కాలేజీలకు ఫీజులు చెల్లిస్తుంది. కానీ ప్రభుత్వం ప్రభుత్వం మూడు, నాలుగు విడుతలుగా ఆ సొమ్మును విద్యార్థుల తల్లుల ఖాతాలకు జమ చేస్తోంది. వారు కాలేజీకి కట్టుకోవాలని ప్రభుత్వం చెబుతోంది. అయితే చాలా మంది తల్లులు కుటుంబ అవసరాలకు వాడుకుంటున్నారు. కాలేజీలకు కట్టడం లేదు.
ఓ వైపు ఫీజు రీఎంబర్స్మెంట్ కోటా కింద కాలేజీలో చేరడం అటు ప్రభుత్వం ఇవ్వకపోవడం.. ఇటు ప్రభుత్వం ఇచ్చినా తల్లులు కాలేజీలకు కట్టకపోవడంతో కాలేజీలు కోర్టులో పిటిషన్లు వేశాయి. తమకు ఫీజులు అందడం లేదని విద్యార్థులు తల్లులు చెల్లించడం లేదని వాదించాయి. ప్రభుత్వం తమకేం సంబంధం లేదని తాము వారికి చెల్లించేశామని వాదించింది. అయితే హైకోర్టు ఈ వాదనతో సంతృప్తి చెందలేదు. గతంలోలా ప్రిన్సిపాల్ అకౌంట్లను ఫీజులు చెల్లించాలని ఆదేశించింది. నేరుగా తల్లులకు ఇస్తే వారికి నగదు ఇచ్చినట్లు అవుతుందని ఓటు బ్యాంక్‌గా ఉంటారన్న ఉ్దదేశంతో ప్రభుత్వం ఈ పథకం తీసుకు వచ్చిది.
కానీ కోర్టులో ఎదురు దెబ్బతప్పలేదు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫీజు రీఎంబర్స్మెంట్ పథకంలో ఎన్నో మార్పులు చేసింది. డిగ్రీ కోర్సులకే సాయం చేస్తోంది. పీజీ కోర్సులకు సాయం చేయడం లేదు. గతంలో కాలేజీలు బకాయిలు చెల్లించకపోయినా విద్యార్థులను ఇబ్బంది పెట్టేవి కాదు. ప్రభుత్వంతోనే లావాదేవీలు నిర్వహించుకునేవి. ప్రస్తుత విధానం వల్ల విద్యార్థుల తల్లుల ఖాతాల్లో వేస్తారు.. దీని వల్ల ప్రభుత్వం ఇవ్వకపోయినా.. ప్రభుత్వం ఇచ్చినా వారు కట్టకపోయినా కాలేజీలకే నష్టం ఏర్పడుతోంది. ఇప్పటికే అనేక సమస్యల మధ్య ఉన్న విద్యా సంస్థలు మరింత ఇబ్బంది పడటం ప్రారంభించాయి. చివరికి అన్ని విషయాల్లోనూ హైకోర్టును ఆశ్రయిస్తున్నారు.