జేమ్స్ బాండ్ సినిమాలకు కృష్ణ కేరాఫ్ అడ్రస్స్. తెలుగులో ఈ ట్రెండ్ మొదలెట్టింది ఆయనే. ఆ తరవాత.. జేమ్స్ బాండ్ తరహా సినిమాలు చాలా వచ్చాయి. ఈమధ్యకాలంలో మళ్లీ ఈ జోనర్ కి ఊపొచ్చింది. కార్తికేయ చేస్తున్న `రాజా విక్రమార్క` కూడా ఓ సీక్రెట్ ఏజెంట్ కథే. టీజర్ ఈ రోజు విడుదలైంది. సరిగ్గా 100 సెకన్ల టీజర్ ఇది. టీజర్ మొత్తం యాక్షన్ ఫీస్టే. ఓ నైజీరియన్ ని అనుకోకుండా పిస్టోల్ తో కాల్చేస్తాడు హీరో. ఆ తరవాత ఉరుకులు, పరుగులే. చివర్లో తేలిందేంటంటే… విక్రమ్ ఓ సీక్రెట్ ఏజెంట్ అని. `చిన్నప్పుడు కృష్ణగారిని, పెద్దయ్యాక టామ్ క్రూజ్ నీ చూసి ఆవేశ పడి జాబ్ లో జాయిన్ అయిపోయాను గానీ, సరదా తీరిపోతోంది` అనే డైలాగ్ తో టీజర్‌ని ముగించారు. ఈ తరహా కథలకు యాక్షన్ తో పాటు.. ట్విస్టులు చాలా కీలకం. మరి రాజా విక్రమార్కలో కూడా ట్విస్టులు ఇంట్రెస్టింగుగా ఉంటే, బాక్సాఫీసు దగ్గర ఈ విక్రమార్క ప్రయత్నం సఫలీకృతం అయినట్టే.