టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్కు ఎలాంటి ఎన్నిక వచ్చినా చాలెంజ్నే. అందుకే ఆయన ప్రతీ ఎన్నికలో బాధ్యత తీసుకుంటారు. మినీ మున్సిపల్ ఎన్నికలు జరిగినా అదే యాక్టివ్ నెస్ చూపిస్తారు. అయితే హుజురాబాద్ విషయంలో మాత్రం అంతర్గతంగా ఏం చేస్తున్నారో కానీ బయటకు మాత్రం అసలు ప్రాధాన్యత లేని అంశంగా చెబుతున్నారు. హుజూరాబాద్ చిన్న ఎన్నిక అని చెబతున్నారు. పెద్ద సమస్య కాదని లోకల్ లీడర్లు చూసుకుంటున్నరని తేలిక చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. గతంలో రాష్ట్ర కమిటీ సమావేశం తర్వాత అదే చెప్పిన ఆయన ఇప్పుడు బయట కార్యకర్తల సమావేశాల్లోనూ అదే చెబుతున్నారు.
హుజురాబాద్ ఉపఎన్నికను కేటీఆర్ అతి చిన్నదిగా తీసి పడేసినా ఆ ఎన్నిక ప్రాధాన్యతపై తెలంగాణ రాజకీయవర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. అక్కడ వచ్చే ఫలితాన్ని బట్టే రాజకీయాల్లో విస్తృతమైన మార్పులు చోటు చేసుకుంటాయని అంచనా వేస్తున్నారు. టీఆర్ఎస్ గెలిస్తే తిరుగులేని విధంగా మళ్లీ శక్తిని నిరూపించుకున్నట్లవుతుంది. కానీ ఈటల గెలిస్తే ఉద్యమకారులంతా ఆయన వైపే ఉన్నారన్న ప్రచారం జరుగుతుంది. అది ఇబ్బందికరమైన విషయం. అందుకే కేటీఆర్ వీలైనంత లో ప్రోఫైల్ ను హుజురాబాద్ విషయంలో మెయిన్ టెయిన్ చేస్తున్నారని అంటున్నారు.
నిజానికి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెంది నమంత్రిగా వర్కింగ్ ప్రెసిడెంట్గా కేటీఆర్ హుజురాబాద్ ఉపఎన్నిక బాధ్యతను తీసుకోవాల్సింది. కానీ ఆయన తీసుకోలేదు. హరీష్ రావుకు ఇచ్చారు. హరీష్ ఎంత కష్టమైన తన ప్రయత్నాలు తాను చేస్తున్నారు. అయితే ఈ లోపే ఉపఎన్నిక చిన్నదని కేటీఆర్ తీసి పారేస్తూండటంతో టీఆర్ఎస్ అంతర్గత రాజకీయాల్లోనూ ఇదో భాగమన్న చర్చ ఆ పార్టీలోనూ నడుస్తోంది. హుజురాబాద్ ఫలితం అనేక మార్పులు తీసుకొస్తుందని కేటీఆర్ చెప్పినంత చిన్న ఎన్నికేం కాదన్న అభిప్రాయం మాత్రం కేటీఆర్ మాటల ద్వారా బలపడుతోందని అంటున్నారు.