కిక్ సినిమాతో తమన్ జాతకం మారిపోయింది. ఆ సినిమా పెద్ద మ్యూజికల్ హిట్. ఇక అక్కడ్నుంచి తమన్ ఆగలేదు. ఏక ధాటిగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడైతే మరీ ప్రవాహంలా దూసుకుపోతున్నాడు. టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం తీసుకునే సంగీత దర్శకుడు తనే. అయితే… కిక్ తో ఛాన్స్ ఇచ్చిన సురేందర్ రెడ్డికీ, తమన్ కీ చిన్న గ్యాప్ వచ్చిందన్నది ఇన్సైడ్ వర్గాల టాక్.
సురేందర్ రెడ్డి కొత్త సినిమా `ఏజెంట్`. అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకి సంగీత దర్శకుడిగా తమన్ ని తీసుకోవాలనుకున్నాడట. అయితే… ఎప్పుడు ఫోన్ చేసినా తమన్ రిసీవ్ చేయకపోవడం, ఆఫీసుకు వెళ్లినా… అస్సలు పట్టించుకోకపోవడంతో, ట్యూన్స్ ఇవ్వడానికి టైమ్ పట్టేస్తుంది వెయిట్ చేయగలవా? అంటూ మాట్లాడడంతో… సూరి హర్టయ్యాడట. అసలే సూరి కూడా మొండోడు. `నువ్వు కాకపోతే ఇంకొకడు` అనుకునే టైపు. అందుకే… హిప్ ఆప్ తమిళ ని సంగీత దర్శకుడిగా ఎంచుకున్నాడు. ఇండ్రస్ట్రీలో ఇలాంటి గ్యాప్ లు రావడం మామూలే. మరుసటి సినిమాకి అంతా సర్దుకుని, పనిచేయడం కూడా సహజమే. మరి వీరిద్దరి మధ్య కూడా అలానే ఉంటుందా? ఈ గ్యాప్ ఇలా కొనసాగుతుందా? కాలమే సమాధానం చెప్పాలి.