ప్రముఖ నటుడు ఉత్తేజ్ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన భార్య పద్మాపతి ఈరోజు ఉదయం కన్నుమూశారు. గత కొంతకాలంగా పద్మావతి కేన్సర్ తో బాధ పడుతున్నారు. ఆమెకి హైదరాబాద్ లోని బసవతారకం ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో.. పద్మావతి కన్నుమూశారు. ఉత్తేజ్కి చేతన, పాట అనే ఇద్దరు అమ్మాయిలు. చేతన ఓ సినిమాలో హీరోయిన్ గానూ చేసింది. ఉత్తేజ్ ఇటీవల ఓ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ స్థాపించారు. ఆ ఇనిస్టిట్యూట్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం పద్మావతి చూసుకునేవారు. అయితే ఇప్పుడు సడన్ గా కాన్సర్ మహమ్మారి ఆమెని కబళించింది.