ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ పార్టీల్లో అలజడి ప్రారంభమవుతోంది. బీజేపీతో తలపడేది సమాజ్ వాదీ పార్టీనే అన్న క్లారిటీ వచ్చింది. బీజేపీతో బీఎస్పీ లోపాయికారీ ఒప్పందాలు చేసుకుంటోంది. ఇక కాంగ్రెస్‌కు మాత్రమే ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి ఉంది. అందుకే ప్రియాంకా గాంధీ సీఎం అభ్యర్థి అనే ఓ ప్రచారాన్ని తెరపైకి తీసుకు వస్తున్నారు. గతంలో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్లో యూపీలో సగం బాధ్యతలు ప్రియాంకకే ఇచ్చారు. కానీ మెరుగైన ఫలితాలు రాలేదు.
ఇప్పుడు కూడా ఆమెకే బాధ్యతలు ఇస్తున్నారు. ఆమె కూడా పార్టీ కోసం పని చేసేందుకు రెడీగానే ఉన్నారు. కానీ సీఎం అఅభ్యర్థి అనే ప్రచారాన్ని మాత్రం కాంగ్రెస్ ఇప్పుడు తెరపైకి తెస్తున్నారు. కాంగ్రెస్‌తో పొత్తులు పెట్టుకునే విషయంలో ఇతర పార్టీలు ఆసక్తికరంగా లేవు. ఒకప్పుడు యూపీలో తిరుగులేని శక్తిగా ఉన్న కాంగ్రెస్ ఇప్పుడు సాదాసీదా ఓటు బ్యాంకును కూడా పొందలేకపోతోంది. మళ్లీ గాంధీ కుటుంబం చరిష్మాను ఉపయోగించుకుంటే తప్ ప్రయోజనం ఉండదనే నిర్ణయానికి వచ్చినట్లుగా తెలుస్తోంది.
అయితే వృద్ధుల్లో గాంధీ ల కుటుంబంపై ఆదరణ ఉన్న కొత్త తరంలో వారికి ఎలాంటి ప్రత్యేక అభిమానం లేకపోవడం వల్ల వారి ఓటు బ్యాంక్ దారుణంగా పడిపోతోంది. ఇప్పుడు ప్రియాంకా గాంధీని యూత్ ఐకాన్‌గా చూపించి యూపీ ఎన్నికల్లో విజయం సాధించాలన్న ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీ కోసం ప్రశాంత్ కిషోర్ వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. ఆయన చేస్తున్న ప్లాన్లలో భాగంగానే ప్రియాంక కాంగ్రెస్ సీఎం అభ్యర్థి అనే ప్రచారం ప్రారంభించారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జనవరి, ఫిబ్రవరిలో ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.