తెలుగులో తమిళ దర్శకుల హవా ఇప్పుడు మళ్లీ మొదలైంది. వాళ్లతో సినిమాలు చేయడానికి మన హీరోలు ఉత్సాహం చూపిస్తున్నారు. అయితే తమిళ తంబీలతో వ్యవహారం అంత ఈజీ కాదన్నది ఆయా హీరోలకు ఇప్పుడిప్పుడే అర్థం అవుతోంది. ఓ యువ హీరో – ఓ తమిళ దర్శకుడితో సినిమా ఇటీవలే మొదలైంది. దర్శకుడు చెప్పిన కథకు ఫ్లాటైపోయిన ఆ హీరో – వెంటనే డేట్లు ఇచ్చేశాడు.
అయితే ఇప్పుడు ఆ హీరోకి సెట్లో చుక్కలు కనిపిస్తున్నాయట. తమిళ దర్శకుడి సినిమా కదా. సెట్లో అంతా తమిళ వాసనే. తమిళ అసిస్టెంట్లు, తమిళ ఫైటర్లు.. ఇలా ఎక్కడ చూసినా అదే తంతు. పైగా.. తెలుగు సినిమాని తమిళ స్టైల్లో తీస్తున్నాడట. తమిళ ఆడియన్స్ సెన్సిబులిటీస్వేరు గా ఉంటాయి. తెలుగులో వేరు. కొన్ని తమిళ సినిమాలు తెలుగులో ఆడకపోవడానికి కారణం అదే. అయితే ఈ దర్శకుడు మాత్రం ఈసినిమాని పూర్తిగా తమిళ స్టైల్ లో తీసుకుంటూ వెళ్తుండే సరికి… తాను చేస్తోంది తెలుగు సినిమానా? తమిళ సినిమానా? అనే డౌటు ఆ హీరోకే వేస్తోందట. ఈ విషయం దర్శకుడికి ఎన్నిసార్లు చెప్పినా చెవికెక్కించుకోవడం లేదట. `మన స్టైలే ఇది కదా` అంటూ నవ్వేస్తూ హీరో మాటల్ని లైట్ తీసుకుంటున్నాడట. దాంతో ఈ సినిమా రిజల్ట్ పై హీరోకి ఆల్రెడీ బెంగ మొదలైపోయిందని ఇన్ సైడ్ వర్గాల టాక్.