టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పొడిగారని కాంగ్రెస్ ముఖ్య నేత శశి్థరూర్ను టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గాడిద అని సంబోధించిన అంశం రాజకీయంగా కలకలం రేపింది. ఐటీ రంగానికి పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్న శశిథరూర్ హైదరాబాద్లో పర్యటించి తెలంగాణ ప్రభుత్వానికి ప్రశంసలు ఇచ్చారు. ఇది రేవంత్ రెడ్డికి ఆగ్రహం తెప్పించింది. తాను ప్రాణాలకు తెగించి రాజకీయ పోరాటం చేస్తూంటే ఇలా ఆయన ప్రశంసలు ఇవ్వడమేమిటని మండిపడ్డారు. జాతీయ మీడియా ప్రతినిధుల సమక్షంలో శశిధరూర్పై తిట్ల వర్షం కురిపించారు.అయితే అయితే చిట్ చాట్. ఓ పత్రిక రేవంత్ రెడ్డి ఇలా శశిధరూర్ను తిట్టారని వార్త రాసేసింది.
ఈ విషయం నిన్న ఉదయం నుంచి జాతీయ రాజకీయాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నేతల్లో చర్చనీయాంశం అయింది. సాయంత్రానికి కేటీఆర్ రేవంత్ రెడ్డి ఆడియోతో సహా ట్వీట్ చేసి.. రేవంత్ రెడ్డిపై తిట్ల వర్షం కురిపించింది. రేవంత్ రెడ్డి దూషించింది…కాంగ్రెస్ పార్టీకే చెందిన ఎంపీని. అయినప్పటికీ కేటీఆర్కు చాలా కోపం వచ్చింది. రేవంత్ రెడ్డిని చెడామడా ట్విట్టర్లో తిట్టేశారు. ఆయనకు కాంగ్రెస్లో ఉండే అర్హత లేదన్నట్లుగా రాహుల్ గాంధీకి కూడా ట్యాగ్ చేశారు. రేవంత్ రెడ్డి.. శశిథరూర్ను తిడితే కేటీఆర్కు ఇంత ఆవేశ పడటం చాలా మందిని ఆశ్చర్య పరిచింది.
అయితే అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు కూడా రేవంత్ మాటల్ని ఖండించారు. వివాదం పెద్దది కాక ముందే స్పందించాలనుకున్న రేవంత్ రెడ్డి నేరుగా శశిథరూర్కే ఫోన్ చేసి.. లూజ్ టాక్ చేసినందుకు క్షమాపణలు కోరారు. దీన్ని శశిథరూర్ అంగీకరించారు. తామంతా కాంగ్రెస్ పార్టీ అని.. అలాంటివి ఎప్పటికప్పుడు మర్చిపోతూంటామని ప్రకటించారు. తెలంగాణలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకు రావడానికి తాను కూడా కృషి చేస్తానని శశిథరూర్ ప్రకటించారు. రాజకీయాల్లో ఇలాంటి వాతావరణం ఉండాలని రేవంత్, శశిథరూర్ వివాదం ముగించిన తీరుపై ఇతర నేతలూ సోషల్ మీడియాలో ట్వీట్లు పెట్టారు.
శుక్రవారం గజ్వేల్లో దళిత, గిరిజన దండోరా సభను రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. దానికి ఒక్క రోజు ముందు రేవంత్ ఆడియో వెలుగులోకి రావడంతో .. ఆ సభపై గందరగోళం సృష్టించడానికి ఈ ఆడియోను కేటీఆర్ వాడుకున్నట్లుగా ఉన్నారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే రేవంత్ టైమ్లీగా స్పందించి ముగింపు పలికారని అంటున్నారు.