ఆంధ్రప్రదేశ్, తెలంగాణ హైకోర్టులకు కొత్త చీఫ్ జస్టిస్‌లు రానున్నారు. తెలంగాణ హైకోర్టు సీజేగా జస్టిస్ సతీశ్‌చంద్ర శర్మ, ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాను నియమించాలని సుప్రీంకోర్టు కొలిజీయం రాష్ట్రపతికి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ అరూప్ కుమార్ గోస్వామి ఉన్నారు. గత జనవరిలోనే ఆయన ఏపీ హైకోర్టుకు సీజేగా వచ్చారు. తొమ్మిది నెలల్లోనే మరోసారి బదిలీపై చత్తీస్ఘడ్ వెళ్తున్నారు.
ఆయనతో పాటు తెలంగాణ హైకోర్టుకు చీఫ్ జస్టిస్‌గా వచ్చిన హిమా కోహ్లీ పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లారు. జస్టిస్ హిమా కోహ్లీ సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా వెళ్లినందున యాక్టింగ్ సీజేగా జస్టిస్ రామచంద్రరావు వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం దేశంలో ఎనిమిది హైకోర్టులకు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌లు ఉన్నారు. అన్ని హైకోర్టులకు పూర్తి స్థాయి సీజేలను సుప్రీంకోర్టు కొలిజీయం సిఫార్సు చేసింది.
ఏపీ హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రస్తుతం చత్తీస్ఘడ్ సీజేగా ఉన్నారు. ఆయనను ఏపీ బదిలీ చేశారు. ఏపీ సీజే..చత్తీస్‌ఘడ్‌కు బదిలీ చేశారు. సుప్రీంకోర్టు కొలిజీయం ఇటీవలి కాలంలో న్యాయవ్యవస్థ పనితీరు మెరుగుపరచడానికి వీలైనంతగా మానవ వనరులను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. శరవేగంగా న్యాయమూర్తులను నియమిస్తున్నారు.