కేంద్ర ప్రభుత్వం స్విగ్గి, జొమాటోలపైనా జీఎస్టీ వడ్డించింది. అవి కేవలం ఫుడ్ అగ్రిగ్రేటర్ యాప్‌లు. అయితే వాటిని కూడా రెస్టారెంట్లుగా పరిగణించి, వాటి ద్వారా చేసిన సరఫరాలపై 5 శాతం జీఎస్టీ పన్ను విధించింది. అంటే ఇక నుంచి స్విగ్గి, జొమాటాల్లో ఏమైనా కొంటే రెస్టారెంట్ ఓ జీఎస్టీ వేస్తుంది. స్విగ్గి, జొమాటోలు మరో జీఎస్టీ వేస్తారు. అంటే ఒక్క ఫుడ్ కోసం రెండు సార్లు కస్టమర్ జీఎస్టీ కట్టాలన్నమాట. అంటే పన్ను మీద పన్ను వేసి ఆన్ లైన్లో ఫుడ్ కొనుక్కోవాలనుకునేవారి దగ్గర్నుంచి పన్నులు పిండుకునే ప్లాన్ అన్నమాట.
జొమాటోకు అయినా స్విగ్గికి అయినా భౌతికంగా ఒక్కటంటే ఒక్క రెస్టారెంట్ లేదు. వారు ఎప్పుడూ సొంతంగా పుడ్ తయారు చేయరు. రెస్టారెంట్ల తరపున ఆర్డర్లు తీసుకుని తమ సొంత డెలివరీ బాయ్‌లతో డెలివరీ చేస్తారు. ఫలానా రెస్టారెంట్ ఫుడ్ కావాలని బుక్ చేసుకుంటే ఆ బిల్లులో ఆ రెస్టారెంట్ కూడా జీఎస్టీ వేసి బిల్లు వసూలు చేస్తుంది. ఇప్పుడు ఆ బిల్లుపై ఐదు శాతం జొమాటో లేదా స్విగ్గు టాక్స్ వసూలు చేసి కేంద్రానికి చెల్లిస్తుంది. ఇప్పుడు ఆ టాక్స్ శాతం పదకొండు దాటిపోతుంది.
సాధారణంగా ప్రజలు ఏదైనా ఓ వస్తువు కొంటే దాని మీద ఎన్ని రకాల పన్నులు చెల్లిస్తారో వారికి అవగాహన ఉండదు. ఒక్క జీఎస్టీ మాత్రమే కడతారు అని అనుకుంటారు. కానీ ఆ వస్తువు ఉత్పత్తికి అవసరమైన ప్రతి ముడి సరుకుపై పన్నుఉంటుంది.తయారీ దారు పన్ను కట్టాలి. ప్రాసెసింగ్ వస్తువులపైనా పన్ను ఉంటుంది. చివరికి అమ్మకానికి జీఎస్టీ వేస్తారు. ఇప్పుడు ఆన్ లైన్ యాప్‌లను కూడా రెస్టారెంట్లుగా మార్చడం వల్ల మరింతగా పన్ను వసూలు చేస్తారు. పన్ను స్వామ్యం అంటే ఇదేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.