భారత బ్యాటింగ్ సంచలనం విరాట్ కోహ్లీ మరోసారి అభిమానులకు షాక్ ఇచ్చాడు. ఇటీవల టీ 20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించిన కోహ్లీ.. ఇప్పుడు ఐపీఎల్లో ఆర్సీబీ కెప్టెన్ గానూ తప్పుకోబోతున్నట్టు ప్రకటించాడు. ఈ సీజన్ తరవాత… ఆర్సీబీ కెప్టెన్సీ వదులుకుంటున్నట్టు కోహ్లీ ఓ ప్రకటనలో తెలిపాడు. అయితే తాను ఎప్పటికీ ఆర్సీబీ ఆటగాడిగానే ఉంటానని, క్రికెట్ ఆడినంత కాలం.. ఈ జట్టుని వదలబోనని అభిమానులకు మాటిచ్చాడు. వన్డే, టెస్ట్, టీ 20, ఐపీఎల్.. ఇలా అన్ని ఫార్మెట్లలోనూ కెప్టెన్గా బాధ్యతలు నెరవేరుస్తుండడంతో కోహ్లీ తీవ్రమైన ఒత్తిడికి గురవుతున్నాడు. ఆ ప్రభావం తన ఆటపై విపరీతంగా పడుతోంది. అందుకే… టీ 20 కెప్టెన్సీకి గుడ్ బై చెప్పాడు. ఇప్పుడు ఐపీఎల్ లోనూ కీలకమైన నిర్ణయం తీసుకున్నాడు. బెంగళూరుకి ఐపీఎల్ కప్పు అందించడం కోహ్లీ కల. అయితే ఇప్పటి వరకూ అది నెరవేరలేదు. కెప్టెన్ గా తన చివరి సీజన్లో అయినా జట్టుకు కప్పు ఇస్తాడేమో చూడాలి.