రీమేకులు, సీక్వెల్స్ జోలికి వెళ్లని దర్శకుడు రాజమౌళి. తన సినిమాల్లో చాలా వాటికి సీక్వెల్స్ తీసేందుకు సరిపడ కథలున్నాయి. కానీ… ఆ దిశగా రాజమౌళి ఆలోచించలేదు. కానీ విజయేంద్ర ప్రసాద్ మాత్రం `విక్రమార్కుడు 2` కథని రెడీ చేసేశారు. ఈ సినిమా రాజమౌళి చేసే అవకాశాలు లేవు. అందుకే మరో దర్శకుడు కావాలి. అలా.. ఈ కథ సంపత్‌నంది చేతికి వెళ్లినట్టు టాలీవుడ్ టాక్. మాస్ కథల్ని తీయడంలో సంపత్ సమర్థుడే. అలా… విక్రమార్కుడు 2 కథ సంపత్ వరకూ వెళ్లి ఆగింది. రవితేజతో సంపత్‌నందికి పనిచేసిన అనుభవం ఉంది. వీరిద్దరి కాంబినేషన్లో `బెంగాల్ టైగర్` వచ్చింది. కమర్షియల్ గా ఆ సినిమా బాగానే ఆడింది. సో… రవితేజకీ… ఇప్పుడు అభ్యంతరం లేకపోవొచ్చు. `సిటీమార్`కి ఓపెనింగ్స్ బాగానే వచ్చినా – చివరి వరకూ నిలబడలేకపోయాయి. కాకపోతే.. సంపత్ స్టామినా అర్థమైంది. దాంతో.. ఇప్పుడు మాస్ హీరోలు సంపత్ వైపు చూస్తున్నారు. సంపత్ నంది మెగా కాంపౌండ్ లో ఓ సినిమా చేస్తాడని గట్టిగా ప్రచారం జరుగుతోంది. మరి ఏమవుతుందో, సంపత్ నంది తరువాతి సినిమా ఏమిటో చూడాలి.