ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రానికి ఎగుమతుల కేంద్రంగా చేస్తోంది. ఇందు కోసం పక్కా ప్రణాళిక రూపొందించింది. ఇందు కోసం వాణిజ్య ఉత్సవ్‌ను నిర్వహిస్తోంది. రెండు రోజుల పాటు ఉత్సవాలను నిర్వహించనున్నారు. సీఎంజగన్ ప్రారంభిస్తారు. ఇప్పటికే గత ప్రభుత్వంతో పోలిస్తే ఎగుమతులను ఏపీ పెంచుకుంది. వచ్చే పదేళ్లలో రెట్టింపు చేయాలన్న లక్ష్యంగా పెట్టుకుంది. అందుకోసమే వాణిజ్య ఉత్సవ్‌ను నిర్వహిస్తున్నారు.
రెండురోజుల పాటు నిర్వహించనున్న వాణిజ్య ఉత్సవ్ సదస్సులో 100 మందికిపైగా ఎగుమతిదారులు పాల్లొంటారు. వివిధ దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. ప్రధానంగా సముద్ర ఉత్పత్తులు, పెట్రో కెమికల్స్, వ్యవసాయం, వైద్య పరికరాల తయారీ వంటి రంగాల్లో ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఎగుమతిదారులకు కల్పిస్తున్న అవకాశాలను ప్రజెంటేషన్ ద్వారా వివరిస్తారు.
ఎగుమతిదారుల కోసం ప్రత్యేకంగాఎక్స్పోర్ట్ ట్రేడ్ పోర్టల్, వైఎస్సార్ వన్ బిజినెస్ అడ్వైజరీ సర్వీసులను రూపొందించారు. వాటిని ఈ రోజు నుంచి అందుబాటులోకి తీసుకు వస్తారు. అలాగే ఏపీ నుంచి భారీగా ఎగుమతుల్ని చేస్తున్న వ్యాపారుల్ని జగన్ సత్కరిస్తారు. ఆజాదీకి అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ప్లాస్టిక్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాతో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఈ వాణిజ్య ఉత్సవ్ నిర్వహిస్తోంది.
ఈ సదస్సుల్లో స్టాల్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఎగుమతిదారులు 20కి పైగా స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. చివరిరోజున అత్యుత్తమ స్టాల్‌కు అవార్డులు ఇస్తారు. తర్వాత జిల్లాల్లో కూడా జిల్లాల్లో స్థానిక ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించే విధంగా వాణిజ్య ఉత్సవ్ సదస్సులు నిర్వహిస్తారు. ఈ ఉత్సవానికి ప్రచారం కల్పించేందుకు ఏపీ ప్రభుత్వం ఫుల్ పేజీ ప్రకటనలు జారీ చేసింది.