తెలుగు సినిమా చరిత్రలో ట్రైన్ ఎపిసోడ్ అంటే.. `నరసింహనాయుడు` చటుక్కున గుర్తొస్తుంది. బాలకృష్ణ పౌరుషానికి మణిశర్మ బీజియం, బి.గోపాల్ టేకింగ్ ఇవన్నీ ఆ సీన్‌ని, ఎమోషన్‌నీ పతాక స్థాయిలో నిలబెట్టాయి. ఆ తరవాత ఆ స్థాయిలో గూజ్బమ్స్ ఇచ్చిన ట్రైన్ ఎపిసోడ్ రాలేదనే చెప్పాలి.
అయితే ఇప్పుడు శంకర్ సినిమాలో అలాంటి సీన్ ఒకటి ఉందట. రామ్ చరణ్‌తో శంకర్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో ఓ కీలకమైన ఘట్టంలో ట్రైన్ ఎపిసోడ్ వస్తుందని సమాచారం. ఈ ఎపిసోడ్ లో రామ్ చరణ్ హీరోయిజాన్ని ఓ స్థాయిలో ఆవిష్కరించబోతున్నాడని తెలుస్తోంది. ఈ సీన్ కోసం చాలా ఖర్చు పెట్టాలని, ఎక్కువ రోజులు షూట్ చేయాలని ఇన్ సైడ్ వర్గాల టాక్. ఇదో యాక్షన్ ఘట్టం. వందలాంది మంది ఫైటర్లు అవసరమట. ఈ సినిమాలో ఈ ట్రైన్ ఫైట్ ప్రధాన ఆకర్షణ కాబోతోందని తెలుస్తోంది. అందుకోసం ఓసెట్ కూడా వేయాల్సివస్తోందట. దాదాపు 200 కోట్ల ప్రాజెక్ట్ ఇది. ఆ బడ్జెట్ రాను రాను పెరగొచ్చు కూడా. ఈ ట్రైన్ ఎపిసోడ్‌కే కనీసం పది కోట్లయినా ఖర్చువుతందని ఇన్ సైడ్ వర్గాల టాక్. కియారా అద్వానీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో అంజలి, సునీల్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.