విజయ్‌తో వంశీ పైడిపల్లి ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు నిర్మాత. ఈ సినిమా కోసం విజయ్ ఏకంగా వంద కోట్ల పారితోషికం తీసుకుంటున్నట్టు టాక్. కథ కూడా ఓకే అయిపోయింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అయితే మేటరేంటంటే… ఇది అచ్చంగా విజయ్ కోసం రాసుకున్న కథ కాదు. మహేష్ కోసం తయారు చేసింది.
మహేష్ – వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో `మహర్షి` వచ్చింది. ఆ వెంటనే.. వీరిద్దరూ మరోసారి కలిసి పనిచేద్దామనుకున్నారు. ఆ ప్రయత్నంలోనే మహేష్ కోసం వంశీ పైడిపల్లి ఓ కథ తయారు చేశాడు. కాకపోతే…అది మళ్లీ మహర్షి, శ్రీమంతుడు టైపులోనే సాగే కథ అయ్యేసరికి మహేష్ `నో` చెప్పాడు. ఆ ఫ్లేవర్ మార్చడానికి వంశీ చేసిన ప్రయత్నాలు సఫలం కాలేదు. `ఈ తరహా కథలు ఇది వరకు వచ్చేశాయ్` అంటూ మహేష్ రిఫరెన్సులతో సహా చెప్పేశాడట. అనుకున్న సమయానికి వంశీ కథ రెడీ చేయలేకపోవడంతో.. పరశురామ్ ని పిలిచి `సర్కారు వారి పాట` సెట్ చేసేశాడు. ఇప్పుడు మహేష్ వద్దన్న కథ తోనే విజయ్ తో సినిమా చేస్తున్నాడట వంశీ. మహేష్ ఈ కథని ఇది వరకు చేసినా, విజయ్ కి కొత్తగానే ఉంటుంది కదా. అందుకే విజయ్ ఒక్క కరక్షన్ కూడా చెప్పకుండా ఈ సినిమాని ఓకే చేసేశాడు. అలా మహేష్ కోసం రాసుకున్న కథ విజయ్ దగ్గరకు వెళ్లింది.