మలయాళ `లూసీఫర్`ని తెలుగులో `గాడ్ ఫాదర్`గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవి కథానాయకుడు. మోహన్ రాజా దర్శకుడు. ఈ సినిమా షూటింగ్ అధికారికంగానూ మొదలైంది. అయితే.. మళ్లీ బ్రేక్ వచ్చి పడింది. దానికి కారణం.. `గాడ్ ఫాదర్` స్క్రిప్టులో కీలకమైన మార్పుల్ని చిరంజీవి సూచించడమే. ఇది వరకే స్క్రిప్టుని లాక్ చేసేశాడు చిరు. కానీ మధ్యలో కొన్ని చిన్న చిన్న అనుమానాలూ, సందేహాలు మొదలవ్వడంతో కీలకమైన సీన్లు రీ రైట్ చేస్తున్నారని సమాచారం. అందుకే షూటింగ్ ఆలస్యం అవుతోందట. చిరు `ఆచార్య`ని ఇంకా పూర్తి చేయాల్సివుంది. అది కూడా ఫినిష్ అయిపోతే… అప్పుడు `గాడ్ ఫాదర్` రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది. ఈలోగా టైమ్ ఉంది కాబట్టి – మార్పులకు అవకాశం దక్కింది. ఈ చిత్రంలో మరో కథానాయకుడి పాత్రకీ అవకాశం ఉంది. ఆ పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ విషయంపైనా చిత్రబృందం మౌనంగానే ఉంది.