దగ్గుబాటి వారి మరో మల్టీస్టారర్ రెడీ అయ్యింది. ఈసారి వెంకటేష్, రానా కలిసి నటించారు. కాకపోతే.. వెండి తెర కోసం కాదు. ఓటీటీ కోసం. నెట్ ఫ్లిక్స్ కోసం వెంకీ, రానా ఇద్దరూ జట్టు కట్టారు. వీరిద్దరూ కలిసి ఓ వెబ్ సిరీస్ లో నటించారు. దీనికి `రానా నాయుడు` అనే టైటిల్ ఖరారు చేశారు. సుపర్ణ్ దర్శకుడు. అమెరికన్ క్రైమ్ డ్రామా రాయ్ దొనోవన్ స్ఫూర్తితో ఈ సిరీస్ ని తెరకెక్కించారు. ఈ థ్రిల్లర్లో వెంకీ గెటప్ కొత్తగా ఉండబోతోంది. ఈ వెబ్ సిరీస్లో ఎన్ని ఎపిసోడ్లు ఉన్నాయి? ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది? అనే విషయాల్ని నెట్ ఫ్లిక్స్ త్వరలోనే వెల్లడి చేయబోతోంది. ఈ సీజన్ హిట్టయితే… తదుపరి సీజన్ల కోసం కూడా స్క్రిప్టు రెడీగా ఉందట. అన్ని దక్షిణాది భాషల్లోనూ ఈ సిరీస్ ని డబ్ చేసి వదలబోతున్నారు. నెట్ ఫ్లిక్స్ లో దక్షిణాది నుంచి చాలా వెబ్ సిరీస్ లు వెళ్లాయి. అయితే.. దేనికీ గొప్ప స్పందన రాలేదు. కంటెంట్, టేకింగ్ పరంగా.. అవన్నీ ఫెయిల్ అయ్యాయి. అయితే తెలుగులోని అగ్ర కథానాయకుల్లో ఒకరిగా చలామణీ అవుతున్న వెంకీ ఓ వెబ్ సిరీస్ చేయడం, అందులో రానా ఉండడంతో – `రానా నాయుడు`పై ఫోకస్ పెరిగే అవకాశం ఉంది.