శేఖర్ కమ్ములకు మిస్టర్ పర్ఫెక్ట్ అని పేరు. ఆయన మరో అమరశిల్పి జక్కన్న. తాను రాసుకున్నది తెరపై చూసుకునేంత వరకూ ఆ సీన్ తీస్తూనే ఉంటారు. ఈ విషయాన్ని ఆయనకూడా చాలా సార్లు చెప్పాడు కూడా. తీసిన సీన్ నచ్చకపోయినా – రీషూట్ చేయడానికి అభ్యంతరం ఉండదు. సినిమాని వీలైనంత త్వరగా చుట్టేయాలి, త్వరగా చూపించేయాలి… అనే తాపత్రయం ఏమాత్రం లేకపోవడంతో, ప్రతీ సీన్‌ని చెక్కుతూ వెళ్తారు. లవ్ స్టోరీ సినిమా ఆలస్యం అవ్వడానికి కూడా కారణం అదే.
నిజానికి ఈ సినిమా కొత్తవాళ్లతో ప్లాన్ చేశారు. వాళ్లతో కొంతమేర షూటింగ్ కూడా చేశారు.కానీ అవుట్ పుట్ సంతృప్తిగా రాకపోవడంతో – ఈ కథని స్టార్స్ తోనే చేయాలని ఫిక్స్ అయ్యారు. అలా సాయిపల్లవి – చైతూ ఈ కథలోకి వచ్చారు. వీళ్లతో కూడా రీ షూట్లు తప్పలేదు. ముఖ్యంగా క్లైమాక్స్ విషయంలో శేఖర్ కమ్ముల చాలా తర్జన భర్జనలు పడ్డారని తెలుస్తోంది. తెరపైచూస్తున్న క్లైమాక్స్ 5వ వెర్షన్. అంతకు ముందు మరో క్లైమాక్స్ ఉండేది. అక్టోబరు 24న సినిమాని విడుదల చేస్తున్నాం – అని ప్రకటించిన తరవాత కూడా క్లైమాక్స్ లో చిన్న చిన్న మార్పులు చేసి, రీషూట్ కి వెళ్లారని సమాచారం. సాయి పల్లవి తన అమ్మమ్మకి చెప్పు చూపించే సీన్… లేటెస్ట్ గా తీసిందేనట. మొత్తానికి శేఖర్ కమ్ముల మరోసారి తన పర్ఫెక్షనిజం చూపించుకున్నాడు.