సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నారని ఇప్పటి వరకూ అపోలో ఆస్పత్రి మెడికల్ బులెటిన్లు తీసుకు వచ్చింది. వెంటిలేటర్ , ఆక్సిజన్ సపోర్ట్ లాంటివి తీసేశామని జనరల్ వార్డుకు కూడా మార్చామని హెల్త్ బులెటిన్ వచ్చింది. ఆయనను పరామర్శించిన అందరూ అదే చెప్పారు. అందుకే సాయితేజ్ నేడో రేపో డిశ్చార్జ్ అవుతారని అందరూ అనుకున్నారు. అయితే పవన్ కల్యాణ్ రిపబ్లిక్ సినిమా ప్రిరిలీజ్ ఫంక్షన్లో ఇంకా కోమాలోనే ఉన్నాడని.. కళ్లు తెరరవలేదని చెప్పడంతో ఇప్పుడు మరోసారి సాయితేజ్ ఆరోగ్యంపై అందరూ ఆరా తీయడం ప్రారంభించారు.
ప్రి రిలీజ్ ఫంక్షన్లో పవన్ కల్యాణ్ ఇతర అంశాలపై ఎక్కువగా స్పందించారు. అవి రాజకీయపరమైన వ్యాఖ్యలు కావడంతో వాటిపై చర్చ జరుగుతోంది. కానీ సాయితేజ్ ఆరోగ్యం గురించి .. పవన్ కల్యాణ్ అన్న కోమా మాటలు హైలెట్ కాలేదు. సాయితేజ్ కోలుకుని ఉండి ఉంటే ఈ పాటికి ఆయన మాటలతో ఓ వీడియోను అయినా రిలీజ్ చేసి ఉండేవారని కానీ ఆయన ఇంకా కోమా నుంచి బయటకు రాలేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.
నిజంగా సాయితేజ్ మెలకువతోనే ఉండి ఉంటే పవన్ కల్యాణ్ కోమాలో ఉన్నారని చెప్పే అవకాశం లేదని అంటున్నారు. ఇంత కాలం కోమాలో ఉన్నారంటే అది సీరియస్ ఇష్యూ అయ్యే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. సాయితేజ్ ఆరోగ్యంపై పూర్తి స్థాయి అప్ డేట్ ఇవ్వాలని ఆయన అభిమానులు కోరుకోవడం సహజమే.