విజయ్ దేవరకొండ ‘లైగర్’ నుంచి స్ట్రైకింగ్ అనౌన్స్మెంట్ అంటూ అందరిలోనూ ఆసక్తిని పెంచారు. ఇప్పుడా అప్డేట్ ఏంటో తెలిసింది. ఈ సినిమాలో బాక్సింగ్ కింగ్ మైక్ టైషన్ కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని సినిమా యూనిట్ అధికారికంగా ప్రకటించింది. టైషన్ కి వెల్ కమ్ కి చెబుతూ చిన్న వీడియో ని కూడా విడుదల చేశారు. లైగర్ ప్యాన్ ఇండియన్ సినిమాగా మొదటి నుంచి చెబుతున్నారు. అయితే ఇప్పుడు మైక్ రాకతో ఈ సినిమా ఒక్కసారిగా ప్యాన్ ఇండియా ద్రుష్టి ని ఆకర్షించింది.
మైక్ బాక్సింగ్ ప్రపంచంలో రారాజు. ఇప్పుడాయన లైగర్ లో కనిపించడం వెరీవెరీ స్పెషలనే చెప్పాలి. లైగర్ కి క్రాస్ బ్రీడ్ అనే క్యాప్షన్ కూడా వుంది. ఇప్పుడు విడుదల చేసిన వీడియోలో సగం మైక్ సగం విజయ్ దేవర కొండ కనిపించారు. ఈ సినిమా బాక్సింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు విడుదల చేసిన వీడియోలో క్రాష్ బ్రీడ్ అనే క్యాప్షన్ కి జస్టీఫికేష్ ఇస్తూ డిజైన్ చేసినట్లుగా వుంది. మొత్తానికి మైక్ రాకతో ప్యాన్ వరల్డ్ ఎఫెక్ట్ వచ్చింది లైగర్ కి. బాలీవుడ్ స్టార్ ప్రొడక్షన్ కంపెనీ ధర్మ ప్రొడక్షన్స్, పూరి కనెక్ట్స్ కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ప్రస్తుతం గోవా లో షూటింగ్ జరుగుతుంది.