పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యను లేవనెత్తితే పవన్ సమాజిక వర్గానికి చెందిన మంత్రులు పవన్ ని టార్గెట్ చేస్తూ తిట్టడం మీద కాపు సంక్షేమ సేన స్పందించింది. వివరాల్లోకి వెళితే..
కాపు సంక్షేమ సేన లెటర్ హెడ్ పై విడుదల చేసిన ఈ లేఖలో, గత కొద్ది రోజులుగా పవన్ కళ్యాణ్ మీద కాపు మంత్రులు ముప్పేట దాడి చేస్తున్నారని, పవన్ కళ్యాణ్ ని అవమానించడం అంటే కాపు సమాజాన్ని అవమానించడమే అని, కాపు మంత్రులు పవన్ కళ్యాణ్ ని తిట్టడం వెనుక జగన్ హస్తం ఉందని తాము భావిస్తున్నామని, 2024 ఎన్నికల్లో జగన్ పార్టీ వీటి పర్యవసానాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని ఆ లేఖలో కాపు సంక్షేమ సేన పేర్కొంది.
కాపు సంక్షేమ సేన ప్రకటన పై వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మరియు ఆ పార్టీలోని కాపు నేతలు ఏ విధంగా స్పందిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది.