తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉపఎన్నికలు జరుగుతున్నాయి. తెలంగాణలో హుజురాబాద్ ఉపఎన్నిక. ఏపీలో బద్వేలు ఉపఎన్నిక. హుజురాబాద్ ఉపఎన్నికల రాజకీయ వ్యూహాల్లో భాగంగా వచ్చింది. బద్వేలు ఉపఎన్నిక కరోనా కారణంగా ఎమ్మెల్యే మృతి చెందడంతో వచ్చింది. హుజురాబాద్‌లో తీవ్రమైన పోటీ నెలకొంది. అక్కడ ఈటల రాజేందర్ రాజీనామా చేసినప్పటి నుండి ఎన్నికల వాతారవణం ఉంది. గెలుపు ఎవరిదనేదానిపై ఎవరికీ స్పష్టమైన అంచనాలు లేవు. పెద్ద ఎత్తువ అన్ని పార్టీలు ప్రచారం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ ముందుగానే చేతులెత్తేసినట్లుగా కనిపిస్తోంది. అభ్యర్థిని 30వ తేదీ తర్వాత ఖరారు చేస్తామని చెబుతున్నారు. టీఆర్ఎస్ తరపున విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్.. బీజేపీ తరపున ఈటల రాజేందర్ పోటీ పడనున్నారు.
ఏపీలోని బద్వేలు ఉపఎన్నిక విషయంలో మాత్రంఏ పార్టీ కూడా అంతగా ఆసక్తి చూపించడం లేదు. అక్కడి వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మార్చి 26వ తేదీన కన్ను మూశారు. అయితే ఆ స్థానం వైసీపీ కంచుకోట కావడంతో తెలుగుదేశం పార్టీ కానీ జనసేన, బీజేపీ కానీ పెద్దగా ఆశలు పెట్టుకోలేదు. వైసీపీ చనిపోయిన ఎమ్మెల్యే భార్య దాసరి సుధనే అభ్యర్థిగా ఖరారు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు గత ఎన్నికల్లో పోటీచేసిన ాజశేఖర్ అనే అభ్యర్థినే టీడీపీ తరపున నిలబెడుతున్నట్లుగా ప్రకటించారు.
వైసీపీ తరపున ఇంకా అభ్యర్థి ఖరారు కాలేదు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి వెంకటసుబ్బయ్య దాదాపు 44 వేల ఓట్ల భారీ మెజారిటీతో గెలిచారు. ఉపఎన్నికలు కాబట్టి అక్కడ అభివృద్ధి పనులకు సీఎం జగన్ నిధులు మంజూరు చేస్తున్నారు. పలు అభివృద్ధిపనులకు గతంలోనే శంకుస్తాపన చేశారు. తాజాగా బద్వేలును రెవిన్యూ డివిజన్‌గా మారుస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం వచ్చినా తమ ప్రాంతానికి ఏమీ జరగలేదన్న అభిప్రాయం అక్కడి ప్రజల్లో ఏర్పడకుండా సీఎం జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
నిబంధనల ప్రకారం ఎవరైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ చనిపోతే ఆరు నెలల్లో ఎ్నికలు పెట్టాల్సిఉంది. కరోనా వ్యాప్తి తీవ్రంగా ఉన్నందువల్ల దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో జరగాల్సిన ఉపఎన్నికలను వాయిదా వేస్తున్నామని కేంద్ర ఎన్నికల సంఘం నెల మొదట్లో ప్రకటించింది. నెలాఖరులో షెడ్యూల్ విడుదల చేసింది. అందుకే అందరి దృష్టి హుజురాబాద్‌పైనే ఉంది.