రష్మిక మందన త్వరలోనే బాలీవుడ్ లో అడుగుపెడుతుంది. సిద్దార్ మల్హోత్రా కి జంటగా మిషన్ మజ్ను సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా ఇంకా విడుదల కాకముందే మరో హీరోతో జత కట్టింది. సినిమాలో కాదు. ఒక కమర్షియల్ లో. విక్కీ కౌశల్ తో ఓ అండర్ వేర్ యాడ్ చేసింది రష్మిక. ఈ యాడ్ చూసిన జనాలు మాత్రం కాస్త షాక్ అయ్యారు. అండర్ వేర్ యాడ్లు అలానే వుంటాయి. కానీ ఇక్కడ రష్మిక వుండటం ఆమె అభిమానులని షాక్ కి గురి చేసింది. ఒక అమ్మాయి అబ్బాయి వేసుకున్న ఇన్నర్ వేర్ వైపు ఆబగా చూసినట్లు, అండర్ వేర్ అందానికే ఫ్లాట్ అయిపోయినట్లు, అసలు చూపుతిప్పుకోలేనంత ఆకర్షణీయంగా ఆ చోటు వున్నట్టుగా యాడ్ లో చూపించారు.
ఈ క్రియేటివిటి ఏమిటో గానీ ఇలాంటి కాన్సెప్ట్ లో రష్మిక కనిపించడం ఆమె అభిమానులకు మింగుడు పడటం లేదు. చేయడానికి ఇంకేం యాడ్లు దొరకలేదా ? దయచేసి ఇలాంటి యాడ్లు మళ్ళీ చేయద్దని సోషల్ మీడియా వేదికగా ఆమెకు మెసేజులు పెడుతున్నారు. అభిమానుల మాట పక్కన పెడితే ఫెమినిస్టుల నుంచి రష్మికకి గట్టి విమర్శలు ఎదురౌతున్నాయి. ఒక అమ్మాయి అబ్బాయి అండర్ వేర్ వంక అంత ఆబగా చూస్తుందా ? నిజ జీవితంలో ఒక అమ్మాయి, అబ్బాయి అండర్ వేర్ చూసి మైకంలో మునుగుతుందా? ఇలాంటి ప్రకటనల ద్వారా అమ్మాయిలని ఎలా చిత్రీకరించాలని భావిస్తున్నారు ? అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. మరి వీటికి రష్మిక సమాధానం చెబుతుందా ? లేదా కామెంట్స్ కామనే అని సైలెంట్ అయిపోతుందో చూడాలి.