కైనటిక్ సంస్థ ప్రతినిధులు శుక్రవారం సీఎం జగన్ను కలిశారు. విశాఖలో రూ. 1750 కోట్ల పెట్టుబడులు పెడతామని ప్రతిపాదన పెట్టారు. విశాఖలో ప్లాంటని..మరొకటని రకరకాల ప్రాతిపాదనలు పెట్టారు. ఆ మేరకు మీడియాకు సమాచారం వచ్చింది. అయితే ఈ కైనటిక్కే 2018 నుంచి ఏపీ ప్రభుత్వ పెద్దలతో ఇదే ప్రతిపాదనలో వస్తోంది.కానీ పెట్టబడులు మాత్రం ఇంత వరకూ ఎక్కడా పెట్టలేదు. 2018లో లోకేష్ మంత్రిగా ఉన్నప్పుడు ప్రతినిధులు వచ్చి సమావేశం అయ్యారు. రూ. 1750 కోట్ల పెట్టుబడుల గురించి చర్చించారు. తర్వతా అడ్రస్ లేరు.
మళ్లీ సీఎంగా జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టాక గత ఏడాది అక్టోబర్లో జగన్ను కలిశారు. కైనెటిక్ గ్రీన్ ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రిక్ గోల్ఫ్ కార్టులతో పాటు బ్యాటరీ స్వాపింగ్ యూనిట్ ఏర్పాటు కోసం రూ. 1,750 కోట్లు పెట్టుబడులు పెడతామని ప్రతినిధులు చెప్పారు.లంబోర్గిని బ్రాండ్ ఎలక్ట్రిక్ వాహనాలు తయారు చేసి విక్రయించేందుకు గాను కైనటిక్ గ్రీన్ సంస్థకు ఒప్పందాలు ఉన్నాయి..ఆ యూనిట్లో ఏపీలో పెడతామని చెప్పారు. కానీ ఏడాది వరకూ చప్పుడు చేయలేదు. నిన్న మళ్లీ కైనటిక్ ప్రతినిధులు అక్టోబర్ ఒకటో తేదీన సీఎంజగన్ను కలిసినట్లుగా ప్రభుత్వం ప్రకటించింది. నిన్న కూడా రూ. 1750 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనల్నే పెట్టారు.
మూడేళ్లుగా రూ 1750 కోట్లను చూపిస్తూ కైనటిక్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వం చుట్టూ ఎందుకు తిరుగుతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. పెట్టాలనే ఆలోచన ఉంటే.. ప్రభుత్వం నుంచి రాయితీలు కావాలంటే అడిగి తీసుకుని పెట్టేయాలి కానీ ప్రతీ ఏడాది వచ్చి … పెట్టుబడులు పెట్టేస్తున్నామని చెప్పడం.. మీడియాలో ప్రచారం చేసుకోవడం మినహా ఎలాంటి ముందడుగు ఉండటం లేదు.