పవన్ కల్యాణ్‌తో పాటు ఆయన కుమార్తె, కుటుంబసభ్యులపై అత్యంత దారుణమైన వ్యాఖ్యలు చేసిన పోసాని కృష్ణమురళిని బ్యాన్ చేయాలని టాలీవుడ్ భావిస్తోంది. ఈ విషయం తెలిసిన పవన్ కల్యాణ్ అలాంటి ఆలోచన చేయవద్దని చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్ కల్యాణ్‌ను నిర్మాతలు అమరావతి వెళ్లి మరీ కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వంతో జరిగిన చర్చలు… ఇండస్ట్రీతో రాజకీయంగా ఎలా గేమ్ అడుతున్నారో విశ్లేషించినట్లుగా తెలుస్తోంది. తమ మాట వినకపోతే.. తాము ఏం చెప్పినా ఖండిస్తే మాత్రం పరిస్థితులు వేరుగా ఉంటాయన్న భయాన్ని కల్పిస్తోందని పవన్ కల్యాణ్‌తో జరిగిన సమావేశంలో నిర్మాతలు ఓ అంచనాకు వచ్చినట్లుగా తెలుస్తోంది.
కరోనా పరిస్థితుల నుంచి పూర్తిగా కోలుకున్నా.. బార్లు, స్కూళ్లు సహా అన్నింటికీ పర్మిషన్ ఇచ్చినా ఒక్క ధియేటర్లకు మాత్రమే అనేక రకాల నిబంధనల పెట్టడం దీనికి సంకేతం అన్న అభిప్రాయం వారిలో వినిపించింది. అయితే తాము ఎవరికీ వ్యతిరేకంగా పోరాటం చేయలేమని నిర్మాతలు పవన్ కల్యాణ్‌కు చెప్పినట్లుగా తెలుస్తోంది. పవన్ కూడా నిర్మాతలు తమ ప్రయోజనాలకు అనుగుణంగా ఉండాలని.. రాజకీయాలతో వారికి సంబంధం లేదని చెప్పినట్లుగా తెలుస్తోంది.
అదే సమయంలో పోసానిని బ్యాన్ చేయాలన్న నిర్ణయాన్ని తీసుకున్నామని చెప్పారని.. అయితే పవన్ కల్యాణ్ అలాంటి నిర్ణయాలు వద్దని వారించినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి పవన్ కల్యాణ్ తమ కోసం మాట్లాడినా తాము పవన్ కు మద్దతుగా రాలేకపోవడంపై నిర్మాతలు పరోక్షంగా అయినా వివరణ ఇచ్చుకున్నారని భావిస్తున్నారు.