సమంతతో విడాకులు తీసుకున్నట్లుగా అక్కినేని నాగచైతన్య అధికారిక ప్రకటించారు. ఎంతో ఆలోచించి నిర్ణయం తీసుకున్నామని.. ఈ క్లిష్ట సమయంలో తన వెంట ఉండాలని ఆయన అభిమానుల్ని కోరారు. టాలీవుడ్లో కొద్ది రోజులుగా సమంత – నాగ చైతన్య విడాకుల అంశం హాట్ టాపిక్‌గా మరింది. వీరు ఎక్కడా జంటగా కనిపించడం లేదు. రెండు నెలల కిందట తన సోషల్ మీడియా పోస్టుల్లో అక్కినేని అనే ఇంటి పేరును సమంత తీసేశారు.
అప్పుడు కుటుంబంలో గొడవలు ఉన్నాయని ఎవరూ అనుకోలేదు. దానికికారణం అప్పటి వరకూ వారు ఎంతో అన్యోన్యంగా ఉండేవారు. అయితే హఠాత్తుగా ఏమయిందో కానీ మెల్లగా విడాకుల అంశం తెరపైకి వచ్చింది. ఈ జంట మధ్య ఇటీవల అభిప్రాయబేధాలు పరిష్కరించుకోనంతగా పెరిగిపోయాయని తెలుస్తోంది. దీంతో ఇద్దరూ పరస్పర అంగీకారంతో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
నిబంధనల ప్రకారం . ఇద్దరికీ ఫ్యామిలీ కౌన్సిలింగ్ కూడా ఇచ్చారు. అయితే వీరిద్దరూ కలిసి ఉండటానికి అంగీకరించలేదు. ఇప్పటికే సమంత- చైతన్య ఇద్దరూ విడిగానే ఉంటున్నారు. ఈ క్రమంలో అధికారికంగా విడాకులు మంజూరు అయినట్లుగా తెలుస్తోంది.అందుకే నాగ చైతన్య ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారని చెబుతున్నారు.