క్రిష్ నుంచి సినిమా వస్తుందంటే మంచి కధ ఉంటుందనే నమ్మకం. ఆయన ట్రాక్ రికార్డ్ ఆలాంటిది. గమ్యం నుంచి ఆయన ప్రయాణం వైవిధ్యంగా సాగుతుంది. డిఫరెంట్ జోనర్ కధలు ఎంచుకొని ఫిలిం మేకర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నారు క్రిష్. ఇప్పుడు ఆయన ఓ నవలని సినిమాగా తీశారు. అదే కొండపొలం. వైష్ణవ్ తేజ్ రకుల్ జంటగా నటించారు. ఈ వారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. ఈ సందర్భంగా క్రిష్ చెప్పిన కొండపోలం కబుర్లు..
* నవలని సినిమాగా తీశారు. ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ?
-నవలకి పరిధి ఎక్కువ. సినిమాకి కొన్ని పరిమితులు వున్నాయి. ప్రేక్షకుడు తనకు వినోదం కావాలని థియేటర్ లోకి అడుగుపెడతాడు. నవలని సినిమాకి ఎడాప్ట్ చేసేటప్పుడు దర్శకుడు ఈ విషయంలో జాగ్రత్త పడాలి. సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రాసిన ‘కొండపొలం’ నవల అద్భుతం. అందులో సినిమా స్క్రీన్ ప్లేయ్ లక్షణాలు చాలా వున్నాయి. సినిమా కోసం కొన్ని మార్పులు చేశాం. రకుల్ ఓబులమ్మ పాత్ర కొత్త రాసుకున్నాం. సినిమాగా చెప్పడానికి అది అవసరం అనిపించింది. ఇదే విషయాన్ని వెంకటరామిరెడ్డి గారికి చెప్పాను. ఆయనే ఓబులమ్మ పాత్రని రాసి పెట్టారు. ఆయన వచ్చిన తర్వాత స్క్రీన్ ప్లేయ్ ఇంకా ఈజీ అయిపొయింది.
* నవలని సినిమాగా తీయాలని ఎలా అనిపించింది ?
– త్రివిక్రమ్ , సుకుమార్, ఇంద్రగంటి మోహన్ కృష్ణ,హరీష్ శంకర్ .. ఇలా అంతా కలుస్తుంటాం. అప్పుడు సాహిత్య చర్చ జరుగుతుంది. చాలా పుస్తకాల గురించి మాట్లాడకుంటాం. నాకు ‘అతడు అడవిని జయించాడు”నవలని సినిమాగా తీయాలనే వుండేది. కానీ కుదరలేదు. తర్వాత కొండపొలం చదివా. రైట్స్ తీసుకున్న. తర్వాత సుకుమార్ ఫోన్ చేసి ”అడవి పొలం’ హక్కులు నేను తీసుకుందాం అనుకున్నా(నవ్వుతూ ) మంచి నవల అల్ ది బెస్ట్ ” చెప్పారు.
* కోవిడ్ సమయంలో షూటింగ్ ఎలా జరిగింది ?
– మొదటి రెండు రోజులు చాలా వింత వుండేది. చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. ఎవరూ కనిపించేవారు కాదు( నవ్వుతూ). వికారాబాద్ అడవిలో షూటింగ్ గురించి స్పెషల్ గా చెప్పుకోవాలి. షూటింగ్ కి సంబధించిన ప్రతి వస్తువు కొండపైకి మోయాలి. పాపం.. వైష్ణవ్ తేజ్ కూడా ఆఫీస్ బాయ్ లో షూటింగ్ సామాన్లు మోసాడు. అన్నిటికంటే పెద్ద ఛాలెంజ్..వెయ్యి గొర్రెల్ని కొండపైకి తీసుకెళ్ళడం.
* వెయ్యి గొర్రెలు ఎందుకు ?
-సినిమా కధ ఇదే. పది గొర్రెల మందికి చూపించాలి. ఒక్కొ మందలో వంద గొర్రెలు. మనుషులు తాగడానికే నీళ్ళు లేని ఓ ప్రాంతంలో వెయ్యి గొర్రెలకు నీరు ఎలా ? అదే ‘కొండపొలం’ కధ. చాలా థ్రిలింగా వుంటుంది. సినిమా చూసాక మీరూ ఓ గొర్రెలకాపరి అయిపోతారు.( నవ్వుతారు )
* గొర్రెల భాష అర్ధమైయిందా ?
– గొర్రెల భాష రాలేదు కానీ వాటితో ఎలా మసులుకోవాలో తెలిసింది.( నవ్వుతూ).
* పవన్ కళ్యాణ్ తో హరిహర వీరమల్లు చేస్తున్నారు.. ఈ గ్యాప్ లో వైష్ణవ్ తేజ్ సినిమా ఎలా ?
– కొండపోలం సినిమా చేయాలని నిర్ణయించుకున్నాక .. పవన్ కళ్యాణ్ పర్మిషన్ తీసుకున్నాను. వైష్ణవ్ తేజ్ ని నేను చిన్నప్పుడు చూశాను. అతని కళ్ళు బావుంటాయి. రవీంద్ర యాదవ్ పాత్రకు సరిపోతాడానికి అనిపించింది. వైష్ణవ్ తేజ్ చెప్పడం .. అన్నీ చకచక జరిగిపోయాయి.
* వైష్ణవ్ తేజ్ ఎలా చేశాడు ?
– వైష్ణవ్ తేజ్ లో నేర్చుకోవాలనే తపన ఎక్కువ. సెట్స్ లో నటులందరినీ పరిశీలిస్తుంటాడు. డైలాగ్స్ ని అర్ధరాత్రులు ప్రాక్టీస్ చేసేవాడు. కొత్త పంధాలో వెళ్ళాలనే ఆలోచన వైష్ణవ్ తేజ్ లో వుంది.
* రకుల్ ని ఎలా ఎంపిక చేశారు ?
– ఓబులమ్మ పాత్ర అనుకున్నపుడు కొందరు మనసులో వున్నారు. రకుల్ కి కధ చెప్పా. చెప్పినప్పుడే ఆమెలో అందమైన గొల్లపిల్ల కనిపించింది.
* హరిహర వీరమల్లు మధ్యలో కొండపొలం అంటే పవ కళ్యాణ్ ఏమన్నారు ?
– ఈ సినిమా మొదలైనప్పుడు హరిహర వీరమల్లు రెండు షెడ్యుళ్ళు పూర్తయ్యాయి. కరోనా సమయంలో ఎలాంటి యాక్టివిటీ జరగడం లేదు. పుస్తకాలు చదవడం. మంచి పుస్తకాలు గురించి చెప్పడం, పుస్తకాలు పంచడం ఇదే పని. అదే సమయంలో కొండపొలం చదివా. కళ్యాణ్ గురించి మనసులో మాట చెప్పా. ఇన్ని కోట్లు పెట్టి హరిహర వీరమల్లు సినిమా చేస్తున్నాం. మధ్యలో మరో చిన్న సినిమా అంటే.. మరో హీరో అయితే తన్ని తరిమేవారు.(నవ్వుతూ) కానీ కళ్యాణ్ అర్ధం చేసుకొని .. ఇలాంటి సమయంలో ఇండస్ట్రీకి సినిమా అవసరమని ప్రోత్సహించారు. తర్వాత రత్నం గారికి చెప్పా. ఆయన ఓకే అన్నారు. ప్రస్తుతం వీరమల్లు పనులూ జరుగుతున్నాయి. ఓ సీన్ తీస్తే ఫస్ట్ హాఫ్ పూర్తవుతుంది.
* కరోనా సమయంలో కూడా ‘కొండపోలం’ ఓటీటీ ఇవ్వకపోవడానికి కారణం ?
– ‘కొండపోలం’ థియేటర్ లో చూడాల్సిన సినిమా. ఎట్టి పరిస్థితిలోనూ థియేటర్ లోనే విడుదల చేయాలనీ భావించాం. దసరాకి రావాలని ఫిక్స్ అయ్యం. అనుకున్నట్లే దసరాకి ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నాం.
* ‘కొండపోలం’ కి కీరవాణి ఎలా వచ్చారు ?
– హరిహర వీరమల్లు టీంతోనే ఈ సినిమా చేయాలనీ ఫిక్స్ అయ్యాం. ఆయనకి పుస్తకం పంపించా. వంద పేజీలు చదివి ఫోన్ చేసి గొర్రెల కాపరుల భాష మాట్లాడారు( నవ్వుతూ) ఆయనకి కధ చాలా బాగా నచ్చింది. ఈ సినిమాలో అద్భుతమైన రీరికార్డింగ్ వింటారు.
* ప్రస్తుతం ఏం పుస్తకాలు చదువుతున్నారు ?
– చాలానే వున్నాయి. ఆన్ అండ్ అఫ్ లో చదువుతూనే వుంటా.
* అల్ ది బెస్ట్
– థ్యాంక్ యూ