ఇండస్ట్రీకి పెద్ద దిక్కు ఎవరూ లేరని…ఎవరూ రారని అలాంటి వారిలో దాసరి నారాయణ రావే ఆఖరు అని మంచు మోహన్ బాబు ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణకు ఇచ్చిన ఇంటర్యూలో తేల్చేశారు. అయితే ప్రకాష్ రాజ్ మాత్రం దానికి భిన్నమైన ప్రకటన చేశారు. ఇప్పటికీ .. ఎప్పటికి ఇండస్ట్రీకి చిరంజీవే పెద్ద దిక్కు అని స్పష్టమైన ప్రకటన చేశారు. దీంతో మూవీ ఆర్టిస్ట్స్ ఎన్నికల వేడి మరింత రాజుకునే అవకాశం ఉంది. గతంలో లెజెండ్ అవార్డు విషయంలో చెలరేగిన వివాదం తరహాలో ఇప్పుడు ఇండస్ట్రీకి ఎవరు పెద్ద అన్న చర్చను మోహన్ బాబు ప్రారంభించినట్లయింది.
ఇటీవలి కాలంలో చిరంజీవి ఫ్యామిలీతో మోహన్ బాబుకు దగ్గర సంబంధాలు ఏర్పడ్డాయన్న అభిప్రాయం కలిగింది. ఇరువురూ ఇచ్చి పుచ్చుకుంటున్న పరిస్థితులు కనిపించాయి. ఓ పంక్షన్లో ముద్దులు కూడా పెట్టుకున్నారు. అయితే అనూహ్యంగా వారి మధ్య మా ఎన్నికలు చిచ్చు పెట్టినట్లుగానే కనిపిస్తున్నాయి. బయటకు తెలియనిది వారి మధ్య చాలా జరిగిందని రాధాకృష్ణ ఇంటర్యూలో మోహన్ బాబు పరోక్షంగానే చెప్పారు.
ఇప్పుడు ప్రకాష్ రాజ్ ప్రకటనతో అది మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ఇప్పుడు మా ఎన్నికల్లో ఎవరు గెలిస్తే వారే ఇండస్ట్రీకి పెద్ద అనుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. విష్ణు గెలిస్తే మోహన్ బాబు..ప్రకాష్ రాజ్ గెలిస్తే చిరంజీవి పెద్ద అన్న పరిస్థితి వచ్చేలా ఉంది.