ప్రభుత్వం నుంచి సాయం పొందాలంటే చాలా చాలా దశలు దాటాలి. అవి దాటుకుని వెళ్లేసరికి సాయం అవసరం కూడా తీరిపోతుంది. జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. అందుకే బాధితులు ప్రభుత్వాలు ఆదుకుంటాయంటే ఎక్కువగా నమ్మకం పెట్టుకోరు. ఈ పరిస్థితిని తెలంగాణ మంత్రి కేటీఆర్ మార్చేస్తున్నారు. నిజమైన అవసరం ఉన్నవాళ్లు.. బాధితులు ఉంటే తక్షణం ఆదుకుంటున్నారు. ఆపదలో ఉన్న వారిని.. అవసరంలో ఉన్న వారిని ఆుదకోవడంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ ఎప్పుడూ చురుగ్గా ఉంటారు.
తన దృష్టికి వచ్చిన వెంటనే ఆయన కుదిరితే ప్రభుత్వ పరంగా లేకపోతే వ్యక్తిగతంగా సాయం చేసేందుకు ఏ మాత్రం ఆలోచించరు. ఇలాంటి సాయాలు చేసేందుకు ఆయన తరపున ఓ ప్రత్యేకమైన టీం కూడా పని చేస్తుంది. ఇటీవలే ఉన్నత చదువులు చదివి పారిశుద్ధ్య కార్మికురాలిగా పని చేస్తున్న యువతి దుస్థితి గురించి తెలుసుకుని వెంటనే ఉద్యోగం ఇప్పించిన కేటీఆర్ .. ఇవాళ మరో చదువుల తల్లికి సాయం చేశారు. మెడిసిన్‌లో సీటు సాధించిన పేద పేద గిరిజన వైద్య విద్యార్థి ఎంబిబిఎస్ చదువుకి సహకారం అందించారు.
ఫీజులు కట్టలేక..చదవు మానేసి కూరగాయలు అమ్మతున్న అఅనూష చదువు గురించి మంత్రి కేటీఆర్‌కు తెలిసింది. అనూష మెడిసిన్ ఫీజుల బాధ్యత తీసుకుంటానని తెలిపిన కేటీఆర్ ఆర్థిక సాయం చెక్‌ను అందించారు. కేటీఆర్ ఇలాంటి సాయాలు పెద్ద ఎత్తున చేస్తూంటారు. ఆయన చురుగ్గా స్పందిస్తూంటారు కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే వినతులు కూడా ఎక్కువగానే ఉంటాయి. ఎవర్నీ నిరాశ పరచకుండా కేటీఆర్ ప్రత్యేకంగా తన టీంను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూంటారు.