మొన్న మంచు విష్ణు మీడియా ముందు ప్రకాష్ రాజ్ తదితరులపై ఫైర్ అయిన సంగతి తెలిసిందే. ప్రెస్ మీట్లో చాలా హైడ్రామా నడిచింది. `రాజశేఖర్ మా నాన్నగారి దగ్గరకు వచ్చి…` అంటూ విష్ణు ఏదో చెప్పబోతుంటే నరేష్ అడ్డుపడి…`కంట్రోల్ కంట్రోల్` అంటూ ఆపడం, ఆ తరవాత విష్ణు ఆ మాటని దాటేయడం ఇదంతా సినిమాటిక్ గా జరిగిపోయాయి. అప్పటి నుంచీ మోహన్ బాబు ఇంటికి రాజశేఖర్ ఎందుకు వెళ్లాడు? అక్కడ ఏం మట్లాడుకున్నారు? ఆ విషయం లో వస్తే కొంపలంటుకునే సంగతులు ఏం ఉన్నాయి? అనే ఉత్సుకత మొదలైంది.
నిజానికి మోహన్ బాబు ఇంటికి రాజశేఖర్ వెళ్లడం భూమి బద్దలైపోయేంత విషయం కాదు. అది సాధారణమే. అయితే ఇప్పుడు విష్ణు ప్యానల్ వేరు, జీవిత ప్యానల్ వేరు. అందుకే రాజశేఖర్ మోహన్ బాబు ఇంటకి వెళ్లడం కాస్త ఇంట్రస్టింగ్ గా మారింది. పైగా విష్ణు ఆవేశంలో రెచ్చిపోవడం, నరేష్ ఆపడం.. ఇదంతా చూస్తే విషయం ఏదో పెద్దదే అయ్యుంటుంది అనుకున్నారంతా. అదేంటన్నది జీవిత క్లారిటీ ఇచ్చేశారు. ఆ ప్రెస్ మీట్లో విష్ణు, నరేష్‌లు వీరావేశం చూపించారు కానీ, అసలు అక్కడ అంతగా ఏం జరగలేదని జీవిత తేల్చేశారు.
”రామోజీ ఫిల్మ్ సిటీలో మా షూటింగ్ జరుగుతోంది. వెళ్లే దారిలోనే మోహన్ బాబు ఇల్లు ఉంది. అందుకే ఆయన అక్కడ కాసేపు ఆగారు. మోహన్ బాబుని కలుసుకున్నారు. బయట అనవసరమైన పుకార్లు వస్తున్నాయి.. ఎందుకిన్ని గొడవలు, కలిసి మాట్లాడుకుంటే సరిపోతుంది కదా… అని చెప్పడానికే రాజశేఖర్ వెళ్లారు. అంతకు మించి ఏం లేదు. దాన్ని ఇంత హైడ్రామాగా సృష్టించాల్సిన అసవరం లేదు” అని చెప్పుకొచ్చారు జీవిత.
అంతే కాదు… ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి జీవిత క్షమాపణలు కూడా చెప్పారు. ”మా ఎన్నికలలో ఓటు వేయను..” అని ఎన్టీఆర్ చెప్పినట్టు ఆమధ్య జీవిత ప్రకటించారు. దీనిపై ఆమె క్లారిటీ ఇవ్వాల్సివచ్చింది. ”ఎన్టీఆర్ ఏదో ఓ మూడ్ లో చెప్పిన మాట అది. దాన్ని నేనే తప్పుగా కన్వే చేశాను. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌కి క్షమాపణలు” అంటూ ఈ ఎపిసోడ్ ని కూడా ముగించేశారు.